ETV Bharat / international

'నో-డీల్'​తో భారత్​, చైనాకు లాభం!

నో డీల్​ బ్రెగ్జిట్​పై ఐరాస ఓ నివేదిక విడుదల చేసింది. ఒప్పందం లేకుండా ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్​ వైదొలిగితే... బ్రిటన్​తో వ్యాపార సంబంధాలున్న దేశాలపై ఏమేర ప్రభావం పడుతుందో అంచనా వేసింది. చైనా, అమెరికా భారీ స్థాయిలో లాభపడతాయని పేర్కొంది.

'నో-డీల్'​తో భారత్​, చైనాకు లాభం!
author img

By

Published : Apr 10, 2019, 7:37 AM IST

Updated : Apr 10, 2019, 10:06 AM IST

'నో-డీల్'​తో భారత్​, చైనాకు లాభం!

ఇప్పుడు ప్రపంచదేశాల చూపు బ్రిటన్​వైపే ఉంది. బ్రెగ్జిట్​ అనంతరం వాణిజ్యపరంగా ఎన్నో మార్పులు జరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఈ ప్రభావంపై ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ధి మండలి 'నో-డీల్​ బ్రెగ్జిట్​: ద ట్రేడ్​ విన్నర్స్​ అండ్​ లూసర్స్​' పేరిట ఓ నివేదిక రూపొందించింది.

ఎలాంటి ఒప్పందం లేకుండా ఐరోపా సమాఖ్య నుంచి నిష్క్రమిస్తే వాణిజ్య పరంగా బ్రిటన్​తో సంబంధాలున్న అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు ప్రభావితమవుతాయని అంచనా వేసింది.

చిన్నపాటి వాణిజ్య భాగస్వాములు భారీగా నష్టపోయే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. అమెరికా, చైనా మాత్రం భారీ లాభాలు పొందుతాయని స్పష్టం చేసింది.

నివేదికలోని అంశాలు...

  • ఐరోపా సమాఖ్య పథకాల వల్ల కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇప్పటి వరకు బ్రిటన్​కు ఎగుమతులు చేసి లాభాలు పొందాయి. ఇప్పుడు సరైన ఒప్పందంతో బ్రిటన్​ తప్పుకుంటే ఐరోపా సమాఖ్యలోని ఒప్పందాలను మార్చుకునేందుకు భాగస్వామ్య దేశాలకు తగిన గడువు లభిస్తుంది.
  • ఎలాంటి ఒప్పందం లేకుండా వైదొలిగితే ఇప్పటివరకు లాభాలు పొందిన దేశాలు తీవ్రంగా నష్టపోతాయి. సుంకాల వల్ల ప్రతికూల పరిస్థితులు చూసిన దేశాలు భారీగా లాభపడతాయి.
  • టర్కీ, దక్షిణ కొరియా, నార్వే, ఐస్​లాండ్​, కంబోడియా, స్విట్జర్​లాండ్​ దేశాల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.
  • బ్రిటన్​కు ఎగుమతుల వల్ల చైనా 10 బిలియన్​ డాలర్ల వరకు లాభం పొందుతుంది. అమెరికా 5.3 బిలియన్​ డాలర్లు లాభపడుతుంది. జపాన్​ విషయంలో ఆ విలువ 4.9 బిలియన్​ డాలర్లు. థాయ్​లాండ్​, వియాత్నం, న్యూజిలాండ్​, భారత్​, దక్షిణాఫ్రికా దేశాలు లాభాలు పొందుతాయి.

ఇదీ చూడండి: సూర్యుడి రహస్యాలకై నాసా అంతరిక్ష నౌక..!

Viral Advisory
Tuesday 9th April 2019
Clients, please note the following addition to our output:
VIRAL (SOCCER): FIFA President Gianni Infantino committs an embarrassing gaffe during the swear-in ceremony of the new President of Brazilian Football Confederation (CBF), Rogerio Caboclo on Tuesday, talking about "the sun and the beaches" of Rio de Janeiro a few hours after the tragedy caused by heavy rain that killed 10 people.
Regards,
SNTV
Last Updated : Apr 10, 2019, 10:06 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.