ETV Bharat / international

'క్రిస్​మస్​ నాటికి కరోనా వ్యాక్సిన్​ రావొచ్చు'

బ్రిటన్​లో క్రిస్​మస్​ నాటికి కరోనా వ్యాక్సిన్​ రావొచ్చని అంచనా వేస్తున్నారు ఆ దేశ వ్యాక్సిన్​ టాస్క్​ఫోర్స్​ అధినేత కేట్​ బింగ్​హమ్. కొవిడ్​-19 నియంత్రణ కోసం ఒక్కసారి వ్యాక్సిన్​ వేసుకుంటే చాలదని కొన్నేళ్లకు ఒకసారి టీకా వేయించుకోవాల్సి ఉంటుందని ఆమె అన్నారు.

corona vaccine
క్రిస్ట్​మస్​ నాటికి కరోనా వ్యాక్సిన్​
author img

By

Published : Oct 17, 2020, 10:58 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్​ కోసం పరిశోధకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఈ ఏడాది క్రిస్​​మస్​ నాటికి బ్రిటన్​లో వ్యాక్సిన్​ రావొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆ దేశ వ్యాక్సిన్​ టాస్క్​ఫోర్స్​ అధినేత కేట్​ బింగ్​హమ్. అయితే వ్యాక్సిన్ అందరికీ కాకుండా అనారోగ్య సమస్యలు ఉన్నవారికే ముందుగా ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. టీకా​ వచ్చినా పరిస్థితులు వెంటనే కుదుటపడవని ఆమె అన్నారు.

సింగిల్​ సరిపోదు..

ఒక్కసారి వ్యాక్సిన్​ వేయించుకుంటే సరిపోతుందని తాను భావించట్లేదని కేట్​ స్పష్టం చేశారు. కొన్నేళ్లకు ఒకసారి రీవ్యాక్సినేషన్​ అవసరమవుతుందని అన్నారు. వైరస్ ఎక్కువగా మార్పులు చెందితే టీకా ప్రయత్నాలు మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్​ వచ్చినా సరఫరా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రాధాన్యం ఆధారంగానే పంపిణీ ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. యూకే ప్రభుత్వం, జాయింట్​ కమిటీ ఆన్​ వ్యాక్సినేషన్​ అండ్​ ఇమ్యునైజేషన్​ (జేసీవీఐ) కలిసి పంపిణీ ప్రణాళిక సిద్ధం చేస్తారని తెలిపారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా వ్యాక్సిన్ల సాయంతో హ్యూమన్​ ట్రయల్స్​ చేస్తున్నారు. ఇందులో ఆరింటిని బ్రిటన్​ అభివృద్ధి చేస్తోంది.

ఇదీ చూడండి: 'కరోనా చికిత్సకు ఆ 4 ఔషధాలు పనికిరావు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.