స్కాట్లాండ్లోని గ్లాస్గోలో.. ప్రపంచ వాతావరణ సదస్సును(కాప్26)(cop26 summit) ప్రారంభించారు బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్(boris johnson speech). మొత్తం జీవజాలాన్ని నాశనం చేయగల ఆయుధం చేతుల్లో ప్రపంచం చిక్కుకుందని హెచ్చరించారు. భూమి పరిస్థితిని.. సీక్రెట్ ఏజెంట్ జేమ్స్ బాండ్ స్థితితో పోల్చారు జాన్సన్. భూమండలాన్ని తుడిచిపెట్టగల బాంబుతో చలగాటమాడుతున్నామని, దానిని ఎలా డిఫ్యూజ్ చేయాలనే దారులు వెతకాల్సిన అవసరం ఉందన్నారు.
" మనం జేమ్స్ బాండ్ పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని నాశనం చేసే ఆయుధం ఊహాజనితం కాదు, నిజం. గ్రీన్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ కోసం మనం చూస్తున్నాం. ఇప్పుడు అది ప్రపంచం మొత్తం అవసరం. అభివృద్ధి చెందిన దేశాలుగా మనపైన ప్రత్యేక బాధ్యత ఉంది. అందుకు ప్రతి దేశానికి సాయంగా నిలవాలి. 200 ఏళ్లుగా పారిశ్రామిక దేశాలు వారి ద్వారా ఉత్పన్నమవుతున్న సమస్యలను పెడచెవిన పెట్టాయి. పారిస్లో ఇచ్చిన మాట ప్రకారం ఏటా 100 బిలియన్ డాలర్లు సాయం చేసేందుకు మనం కృషి చేయాలి. అయితే.. దానిని సాధించేందుకు 2023 వచ్చేలా కనిపిస్తోంది. 250 ఏళ్ల క్రితం గ్లాస్గోలో జేమ్స్ వాట్.. స్టీమ్ ఇంజిన్ను కనుగొన్నాడు. అది బొగ్గును మండించటం ద్వారా నడుస్తుంది. దానిని మనం డూమ్స్ డే మిషన్ స్థాయికి తీసుకొచ్చాం. "
- బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధానమంత్రి
జీ20 శిఖరాగ్ర సదస్సులో(G20 summit) వాతావరణ మార్పులపై అగ్రదేశాధినేతలు కొన్నింటికి మాత్రమే అంగీకారం తెలపటంపై పెదవి విరిశారు బోరిస్.