ETV Bharat / international

బ్రెగ్జిట్​కు ముందు ఈయూ దేశాల్లో బోరిస్ పర్యటన - ఫ్రాన్స్

బోరిస్ జాన్సన్ తొలిసారి బ్రిటన్​ ప్రధాని హోదాలో ఐరోపా దేశాల్లో పర్యటించనున్నారు. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్​తో జాన్సన్ సమావేశమవుతారు. ఈయూ సభ్యత్వాన్ని అమలుచేసే దశాబ్దాల నాటి చట్టాన్ని రద్దు చేయాలని బోరిస్ ప్రభుత్వం భావిస్తోంది. అలాగే కచ్చితంగా ఈయూ కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది.

బ్రెగ్జిట్​కు ముందు ఈయూ దేశాల్లో బోరిస్ పర్యటన
author img

By

Published : Aug 19, 2019, 5:56 AM IST

Updated : Sep 27, 2019, 11:34 AM IST

బ్రెగ్జిట్​కు ముందు ఈయూ దేశాల్లో బోరిస్ పర్యటన

బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్​ తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా ఈ వారం ఐరోపా దేశాలను సందర్శిస్తారు. రెండున్నర నెలలుగా... ఒప్పందాలు లేని బేషరతు బ్రెగ్జిట్​ గురించి భయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

"బోరిస్ జాన్సన్​ బుధవారం బెర్లిన్​ చేరుకుంటారు. జర్మనీ ఛాన్సలర్​ ఏంజెలా మెర్కెల్​తో చర్చలు జరుపుతారు. గురువారం పారిస్​ వెళ్లి, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్​తోనూ సమావేశమవుతారు."- డౌనింగ్ స్ట్రీట్​ కార్యాలయం

బ్రిటన్​కు ఈయూ సభ్యత్వాన్ని అమలుచేసే దశాబ్దాల నాటి చట్టాన్ని రద్దుచేయాలని బోరిస్ ప్రభుత్వం భావిస్తోంది.

బోరిస్ దౌత్యం..

ఫ్రాన్స్​లో జరగనున్న జీ-7 శిఖరాగ్ర సదస్సుకు ముందు... బోరిస్ జాన్సన్ ఐరోపా దేశాల్లో దౌత్యపరమైన ప్రయత్నాలు ప్రారంభించడం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్రెగ్జిట్ నిబంధనలపై మరోమారు చర్చలు చేపట్టాలని బోరిస్ కోరవచ్చు. లేదా బ్రెగ్జిట్​కు ఆఖరి తేదీ అయిన అక్టోబర్ 31​న ఈయూ నుంచి బ్రిటన్ వైదొలుగుతుందని హెచ్చరించవచ్చు.

గతేడాది అప్పటి బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పునఃసమీక్షించడానికి ఐరోపా సమాఖ్య నాయకులు పదేపదే నిరాకరించారు. బోరిస్ జాన్సన్​కూ ఈ విషయంలోనే ఒత్తిళ్లు ఉన్నాయి. ఫలితంగా ఈయూ నుంచి ఎలాంటి ఒప్పందం లేకుండానే బ్రిటన్ వైదొలిగే అవకాశం ఉంది.

వెనుదిరిగే ప్రసక్తే లేదు..

'బ్రస్సెల్స్​ నుంచి మా చట్టాల నియంత్రణను మేము తిరిగి తీసుకుంటామని' బ్రెగ్జిట్ వ్యవహారాల మంత్రి స్టీవ్​ బార్క్​లే స్పష్టం చేశారు.

"దేశ ప్రజలకు స్పష్టమైన సంకేతం ఇస్తున్నాం. వెనుదిరిగే సమస్యే లేదు. ఎట్టి పరిస్థితిల్లోనూ.... వాగ్దానం చేసిన విధంగా అక్టోబర్ 31న ఈయూ నుంచి (బ్రిటన్) వైదొలుగుతున్నాం. "- స్టీవ్​ బార్క్​లే, బ్రెగ్జిట్ వ్యవహారాల శాఖ మంత్రి

ఇదీ చూడండి: ప్రాణాధార వ్యవస్థపై అరుణ్ జైట్లీ... పరిస్థితి విష
మం

AP Video Delivery Log - 2200 GMT News
Sunday, 18 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2151: Honduras Stadium Violence 3 AP Clients Only 4225566
Damage to vandalised bus carrying Honduras team
AP-APTN-2144: US NJ Trump Departure AP Clients Only 4225565
Trump comments on China trade, Greenland
AP-APTN-2002: Honduras Stadium Violence 2 No access Honduras 4225564
Honduras match suspended after opposing fans clash
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 27, 2019, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.