ETV Bharat / international

ఉక్రెయిన్​ క్షిపణి దాడిలో 20 మంది మృతి

Ukraine Russia War: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. పలు నగరాల్లో బాంబులు, క్షిపణుల మోత మోగుతూనే ఉంది. డొనెట్స్క్​లో ఉక్రెయిన్​ జరిపిన క్షిపణిదాడిలో 20 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 28 మంది గాయపడ్డారు. మరోవైపు అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. ఈ ప్రంసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని అమెరికా నిర్ణయించింది.

Ukraine Russia War
Ukraine Russia War
author img

By

Published : Mar 15, 2022, 9:59 AM IST

Ukraine Russia War: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. కీవ్​, మైకొలేవ్​, ఖర్కివ్​, ఖేర్సన్​ సహా పలు ప్రధాన నగరాలపై రష్యా సైన్యం విరుచుకుపడుతోంది. చెర్నిహైవ్​ నగరం.. మూడు శక్తిమంతమైన దాడులతో దద్దరిల్లింది. కీవ్​లో సరకు రవాణా విమానాలు తయారుచేసే పరిశ్రమపై దాడి జరిగింది. మరోవైపు.. డొనెట్స్క్​లో ఉక్రెయిన్​ క్షిపణి దాడి జరపగా.. 20 మంది చనిపోయారు. మరో 28 మంది గాయపడ్డారు.

డొన్​బాస్​లో ఇరు వర్గాల మధ్య భీకర దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్​ ఆర్మీ ప్రకారం.. 100 మందికిపైగా రష్యా సైనికులు మరణించారు. ఆరు వాహనాలు ధ్వంసమైనట్లు కీవ్​ ఇండిపెండెంట్​ పేర్కొంది.

అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి జెలెన్​స్కీ ప్రసంగం

అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ.. వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్‌ను ఉద్దేశించి జెలెన్​స్కీ చేసే ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని బైడెన్ సర్కార్ నిర్ణయించింది. ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న దేశాధినేతకు తామిచ్చే గౌరవానికి ఈ ప్రసంగం.. ఓ నిదర్శనమని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ వెల్లడించారు.

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడులు, తాము చేస్తున్న ప్రతిఘటనను జెలెన్​స్కీ అమెరికా చట్టసభలకు వివరించనున్నారు. ఈనెల మొదటి వారంలో ఒకసారి అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి వీడియో కాల్‌ ద్వారా మాట్లాడిన జెలెన్​స్కీ.. మరింత సైనిక సాయం చేయాలని అభ్యర్థించారు. బుధవారం (స్థానిక కాలమానం ప్రకారం) మరోసారి సాయం కోసం విజ్ఞప్తి చేయనున్నారు.

ఉక్రెయిన్‌కు 13.6 బిలియన్‌ డాలర్ల సాయం చేసే బిల్లును ఇటీవలే అమెరికా కాంగ్రెస్‌ ఆమోదించింది. ఆ బిల్లుపై బైడెన్ మంగళవారం సంతకం చేయనున్నారు.

చైనా సాయం కోరిన రష్యా

ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యా.. మరింత ముందుకెళ్లేందుకు చైనా సాయం కోరినట్లు తెలుస్తోంది. ఆయుధాలతో పాటు ఆర్థిక సాయాన్ని అభ్యర్థించినట్లు సమాచారం. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాన్ని ఉటంకిస్తూ ఓ అమెరికా అధికారి ఆరోపించారు. ఈ విషయమై చైనాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది అమెరికా. రష్యాకు సహకరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని చైనాకు హెచ్చరించింది అమెరికా. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరింది.

పుతిన్​తో ఇజ్రాయెల్​ ప్రధాని మరోసారి భేటీ

రష్యా అధ్యక్షుడు పుతిన్​తో ఇజ్రాయెల్​ ప్రధాని నఫ్తాలి బెన్నెట్​ మరోసారి భేటీ అయ్యారు. ఉక్రెయిన్​లో నెలకొన్న పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించినట్లు క్రెమ్లిన్​ తెలిపింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్​ సీనియర్​ అధికారి ధ్రువీకరించారు. పుతిన్‌తో బెన్నెట్ సంభాషణ 90 నిమిషాల పాటు కొనసాగిందని, కాల్పుల విరమణ, మానవతా సమస్యలపై చర్చలు సాగాయని ఆయన తెలిపారు.

ఇదీ చూడండి: 'ఉక్రెయిన్​కు ఆయుధాలు ఇస్తాం.. వారిని ఆదుకుంటాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.