ETV Bharat / international

'క్షిపణులు ఎగురుతున్న చోట చర్చలేంటి?'.. రష్యాపై జెలెన్​స్కీ మండిపాటు - వ్లాదిమిర్​ పుతిన్​

UKRAINE RUSSIA TALKS: శాంతి చర్చలకు సిద్ధమంటూ రష్యా చేసిన ప్రకటనను తిరస్కరించారు ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీ. బెలారస్​లోని పలు ప్రాంతాల నుంచి దాడులు చేస్తోందని గుర్తు చేశారు. ఆ ప్రాంతంలో కాకుండా మాపై దాడులు చేయని దేశాల్లో మాత్రమే చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు.

UKRAINE RUSSIA TALKS
వొలొదిమిర్​ జెలెన్​స్కీ
author img

By

Published : Feb 27, 2022, 3:17 PM IST

UKRAINE RUSSIA TALKS: బెలారస్‌లోని గోమెల్‌ నగరంలో శాంతి చర్చలకు సిద్ధమంటూ రష్యా చేసిన ఆఫర్‌ను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తిరస్కరించారు. బెలారస్‌లోని పలు ప్రాంతాల నుంచి రష్యా దాడులు చేస్తోందని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తమపై విరుచుకుపడని దేశాల్లో మాత్రమే చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. పోలండ్‌ రాజధాని వార్సా, టర్కీలోని ఇస్తాంబుల్‌, అజర్‌బైజాన్‌ రాజధాని బకూ వంటి ప్రాంతాలు చర్చలకు అనువైనవిగా ఆయన పేర్కొన్నారు.

మరోవైపు గత రాత్రి ఉక్రెయిన్‌లో రష్యా సేనల దాడులు అత్యంత క్రూరంగా కొనసాగాయని జెలెన్‌స్కీ తెలిపారు. సామాన్య పౌరులు నివసిస్తున్న ప్రాంతాలను సైతం లక్ష్యంగా చేసుకున్నారన్నారు. చివరకు అంబులెన్సులపైనా దాడి చేస్తున్నారని ఆరోపించారు.

ఉక్రెయిన్‌కు విదేశీ మాజీ సైనికుల సాయం?

మరోవైపు సైన్యంలో పనిచేసిన అనుభం ఉన్న ఐరోపా వాసులెవరైనా సరే ఉక్రెయిన్‌ చేస్తున్న పోరాటంలో చేరాలని జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు. ఐరోపాను కాపాడుకోవడానికి ఇది చాలా అవసరమంటూ వారిలో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. దీంతో ఎస్తోనియా, లాత్వియా, జార్జియా, పోలండ్‌ వంటి దేశాల నుంచి పలువురు మాజీ సైనికులు ఉక్రెయిన్‌కు వస్తున్నట్లు అక్కడి స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

ఇదీ చూడండి: నాలుగో రోజుకు చేరిన యుద్ధం- చర్చలకు రష్యా ఆహ్వానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.