ETV Bharat / international

సాయుధుడి చెర నుంచి ప్రయాణికులు సురక్షితం - passengers news

ఉక్రెయిన్​లో ఆయుధాలు, పేలుడు పదార్థాలతో బస్సును అదుపులోకి తీసుకుని దుండగుడు.. బెదిరింపులకు పాల్పడిన ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సుదీర్ఘంగా సాగిన చర్చల అనంతరం.. సాయుధుడు లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 13 మందిని కాపాడినట్లు పోలీసులు వెల్లడించారు.

Ukraine hostage
సాయుధుడి చెర నుంచి ప్రయాణికులు సురక్షితం
author img

By

Published : Jul 22, 2020, 10:40 AM IST

ఉక్రెయిన్​లో బస్సు హైజాక్​ చేసిన ఘటనలో 12 గంటల ప్రతిష్టంభనకు తెరపడింది. సాయుధుడి చెర నుంచి 13 మంది ప్రయాణికులను కాపాడినట్లు అధికారులు వెల్లడించారు. సుదీర్ఘ చర్చల అనంతరం దుండగుడు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడ్ని అరెస్ట్​ చేశారు.

వాయవ్య ఉక్రెయిన్​లోని కైవ్​కు పశ్చిమాన 400 కిలోమీటర్ల దూరంలోని లుట్స్క్​ ప్రాంతంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలతో ఉన్న దుండగుడు ఓ బస్సును తన అధీనంలోకి తీసుకుని ప్రయాణికులను బంధించాడు. మంగళవారం ఉదయం 9.25 గంటల ప్రాంతంలో అతడే ఫోన్​ చేసి.. తాను మక్సిమ్​ ప్లోఖోయ్​ అని, ప్రయాణికులను బంధించానని చెప్పినట్లు ఆ దేశ హోంశాఖ సహాయ మంత్రి ఆంటోన్​ గెరశ్​ చెంకో తెలిపారు.

ఓ సందర్భంలో దుండగుడు బస్సు కిటికీలోంచి పేలుడు పదార్థాలను బయటకి విసిరాడని, పోలీసు డ్రోన్లపై కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. అయితే.. ఎవరీకి హాని జరగలేదని తెలిపారు. ప్రయాణికులను విడిపించేందుకు అతడితో చర్చలు జరిపామని పేర్కొన్నారు దేశాధ్యక్షుడు జెలెన్​స్కీ. సుదీర్ఘ చర్చల అనంతరం అతడు లొంగిపోయినట్లు చెప్పారు.

మొదట 20 మందిగా..

సాయుధుడి అధీనంలో మొదట 20 మంది ప్రయాణికులు బంధీగా ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. అతడితో చర్చలు జరుపుతున్న క్రమంలో ఓ గర్భిణీ సహా ముగ్గురిని విడిచిపెట్టాడని తెలిపారు. దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మిగతా 10 మంది సురక్షితంగా బయటపడినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: బస్సులో 20 మందిని బంధించిన సాయుధుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.