ETV Bharat / international

Ukraine Crisis: మభ్యపెట్టి దెబ్బతీయడానికి రష్యా సిద్ధం? - ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ రష్యా స్వీడన్

Ukraine Crisis: 'ఫాల్స్‌ ఫ్లాగ్‌'.. రష్యా చిరకాల పోరాట వ్యూహం. ఉక్రెయిన్‌పై దండెత్తడానికి ఆ ఎత్తుగడనే అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు అమెరికా, బ్రిటన్​ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే గతంలో ఫాల్స్‌ ఫ్లాగ్‌ వ్యూహం ఎప్పటి నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది? రెండో ప్రపంచ యుద్ధంలో దీని పాత్ర ఎంత?

RUSSIA FALSE FLAG
RUSSIA FALSE FLAG
author img

By

Published : Feb 20, 2022, 10:41 AM IST

FALSE FLAG operation Russia: తన మీద తానే దాడి చేసుకుని, అది ప్రత్యర్థి చేసిన పనిగా బుకాయిస్తూ యుద్ధానికి దిగడం చిరకాల పోరాట వ్యూహం. ఇలా మభ్యపెట్టే కార్యకలాపాలను సైనిక పరిభాషలో 'ఫాల్స్‌ ఫ్లాగ్‌' దాడి అంటారు. ఉక్రెయిన్‌పై దండెత్తడానికి రష్యా సరిగ్గా ఇలాంటి ఎత్తుగడనే అనుసరించనున్నదని అమెరికా, బ్రిటన్‌ అనుమానిస్తున్నాయి. ఫాల్స్‌ ఫ్లాగ్‌ అనేది 16వ శతాబ్దిలో సముద్రపు దొంగల మోసపూరిత కార్యకలాపాల నుంచి పుట్టుకొచ్చింది. అప్పట్లో వాణిజ్య నౌకలను బురిడీ కొట్టించడానికి సముద్రపు దొంగలు తమ నౌకలపై మిత్రదేశ జెండాలను ఎగురవేసేవారు. వాటిని చూసి వాణిజ్య నౌకలు ఆ నౌకలను దగ్గరకు రానిచ్చేవి. తీరా సమీపంలోకి వచ్చాక జెండాలు దించేసి సొంత జెండాలతో దొంగలు వాణిజ్య నౌకలపైకి ఉరికి సరకు దోపిడీ చేసేవారు. తరవాత ఇలాంటి ఫాల్స్‌ ఫ్లాగ్‌ ఎత్తుగడతో దేశాలు యుద్ధానికి దిగిన ఘటనలు చరిత్రలో అనేకం.

రష్యా-స్వీడన్‌ యుద్ధం

FALSE FLAG Russia Sweden war: ఆధునిక కాలంలో మొదటిసారి ఫాల్స్‌ ఫ్లాగ్‌ దాడిని నిర్వహించిన దేశంగా స్వీడన్‌ను చెప్పాలి. పూర్వ రష్యా-స్వీడన్‌ సరిహద్దు రేఖ వద్ద పూమల అనే స్వీడిష్‌ గస్తీ కేంద్రం ఉండేది. 1788లో కొందరు స్వీడిష్‌ సైనికులు రష్యా సైనికుల యూనిఫారాలు ధరించి తమ గస్తీ కేంద్రంపై తామే దాడిచేశారు. అప్పటివరకు రష్యాతో యుద్ధానికి అంగీకరించని స్వీడిష్‌ పార్లమెంటు.. పూమల ఘటనతో ఎదురుదాడికి సమ్మతించింది. స్వీడన్‌ రాజు మూడవ గుస్తావ్‌కు యుద్ధ ప్రకటన చేసే అధికారం లేనందున పార్లమెంటు సమ్మతి తప్పనిసరి. అది లభించిన వెంటనే రాజు రష్యాపై యుద్ధం ప్రారంభించారు. అది రెండేళ్లపాటు సాగింది.

రెండవ జపాన్‌-చైనా యుద్ధం

Japan China False Flag operation: చైనా భూభాగంలో తమ అధీనంలోని ముక్డెన్‌ ప్రాంతంలో ఒక రైల్వే లైనుపై జపాన్‌ సైన్యం స్వయంగా బాంబు పెట్టింది. ఈ పేలుడు వల్ల పెద్దగా నష్టం జరగలేదు. రైళ్ల రాకపోకలు యథాతథంగా సాగాయి. అయినా పేలుడును సాకుగా చూపి జపాన్‌ సైన్యం 1931 సెప్టెంబరులో మంచూరియాపై దండెత్తి ఆ ప్రాంతాన్ని ఆక్రమించింది. తరవాత దాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించింది.

గ్లైవిట్స్‌ ఘటన

జర్మనీ 1939లో పోలండ్‌పై దండెత్తడానికి ముందురోజు రాత్రి ఏడుగురు జర్మన్‌ సైనికులు పోలిష్‌ సైనికులుగా నటిస్తూ సరిహద్దుకు దగ్గర్లో జర్మన్‌ భూభాగంలోని గ్లైవిట్స్‌ రేడియో కేంద్రాన్ని ఆక్రమించారు. ఈ కేంద్రం ఇప్పుడు పోలండ్‌ చేతుల్లో ఉందంటూ సంక్షిప్త సందేశాన్ని ప్రసారం చేశారు. ఒక పౌరుని మృత దేహానికి పోలిష్‌ సైనిక దుస్తులు తొడిగి అక్కడ వదిలేశారు. దాడిలో అతడు మరణించినట్లు ప్రపంచాన్ని నమ్మించడానికి ఆ ఎత్తు వేశారు. మరుసటి రోజు గ్లైవిట్స్‌తో పాటు అటువంటి ఇతర ఘటనలను సాకుగా చూపి పోలండ్‌పై అడాల్ఫ్‌ హిట్లర్‌ దండయాత్ర ప్రారంభించారు.

రష్యా-ఫిన్లాండ్‌ యుద్ధం

జర్మనీ ఫాల్స్‌ ఫ్లాగ్‌ ఎత్తుగడతో 1939లో పోలండ్‌పై దాడి చేయగా సోవియట్‌ యూనియన్‌ అదే సంవత్సరం అదే చిట్కాను ఫిన్లాండ్‌పై దండెత్తడానికి ఉపయోగించింది. అప్పట్లో రెండు దేశాల సరిహద్దు రేఖకు సమీపంలో రష్యా భూభాగంలోని మైనిలా గ్రామంపై గుళ్ల వర్షం కురిసింది. ఇది ఫిన్లాండ్‌ సైన్యం చేసిన పని కాదనీ, సోవియట్‌ ఆంతరంగిక భద్రతా సంస్థ ఎన్‌.కె.వి.డి. ఏజెంట్లు ఫిన్లాండ్‌ సైనికుల ముసుగులో దాడి చేశారని తేలింది. సోవియట్, ఫిన్లాండ్‌ల మధ్య దురాక్రమణ నిరోధ ఒప్పందం ఉన్నా, ఫాల్స్‌ ఫ్లాగ్‌ దాడిని అడ్డుపెట్టుకుని ఫిన్లాండ్‌తో సోవియట్‌ యూనియన్‌ శీతాకాల యుద్ధం ప్రారంభించింది. ఇది పూర్తిగా సోవియట్‌ జరిపిన దురాక్రమణ యుద్ధమని 1994లో రష్యన్‌ సమాఖ్య తొలి అధ్యక్షుడు బోరిస్‌ యెల్‌త్సిన్‌ ఒప్పుకున్నారు.

ఇరాన్‌పై సీఐఏ ఫాల్స్‌ ఫ్లాగ్‌ దాడి

అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ 1953లో ఇరాన్‌లో మహమ్మద్‌ మొసాడెక్‌ ప్రభుత్వాన్ని దించడానికి ఫాల్స్‌ ఫ్లాగ్‌ దాడి జరిపింది. ఇరాన్‌ భూభాగంలో తానే బాంబు పేలుళ్లు నిర్వహించి అవి కమ్యూనిస్టు సానుభూతిపరులు చేసిన పనిగా బుకాయించింది. ఈ విషయంలో సీఐఏకి బ్రిటిష్‌ గూఢచారి సంస్థ ఎం6 తోడ్పడింది.

క్యూబా వ్యతిరేక కార్యకలాపాలు

కమ్యూనిస్టు క్యూబాపై సైనిక చర్యకు దిగడానికి సాకుగా 1962లో అమెరికా గూఢచారి సంస్థలు ఆపరేషన్‌ నార్త్‌ వుడ్స్‌ పేరిట ఫాల్స్‌ ఫ్లాగ్‌ కార్యకలాపాలు నిర్వహించ తలపెట్టాయి. అమెరికా పౌర, సైనిక కేంద్రాలపై తామే దాడులు చేసి, అవి క్యూబా అధినేత క్యాస్ట్రో సర్కారు చేయించిన ఉగ్రవాద చర్యలని ప్రపంచాన్ని మభ్యపెట్టేందుకు అమెరికా రక్షణ శాఖ పన్నాగం పన్నింది. ఈ ప్రతిపాదనను నాటి అమెరికా అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌. కెనడీ తోసిపుచ్చారు.

గల్ఫ్‌ ఆఫ్‌ టోన్కిన్‌

వియత్నాం తీరానికి సమీపంలోని టోన్కిన్‌ సింధు శాఖలో ఒక అమెరికన్‌ డిస్ట్రాయర్‌ నౌకకూ, ఉత్తర వియత్నాం టార్పిడో బోట్లకూ మధ్య 1964 ఆగస్టు 2న సముద్ర పోరు జరిగింది. రెండు దేశాల నౌకలకూ నష్టం వాటిల్లింది. ఉత్తర వియత్నాం నలుగురు నావికులను కోల్పోయింది. ఆరుగురు గాయపడ్డారు. రెండు రోజుల తరవాత ఉత్తర వియత్నాం మళ్లీ తమపై దాడి చేసిందని అమెరికా జాతీయ భద్రత సంస్థ ప్రకటించింది. వియత్నాం టార్పిడో బోట్లు తమను చుట్టుముట్టి కాల్పులు జరిపాయని అమెరికాకు చెందిన కెప్టెన్‌ చెప్పుకొచ్చారు. ఆ తరవాత మాటమార్చి.. వాతావరణం సరిగా లేకపోవడంతో తన చుట్టూ ఏం జరుగుతోందో కనిపెట్టలేకపోయానని సంజాయిషీ ఇచ్చారు. ఈ ఫాల్స్‌ ఫ్లాగ్‌ ఘటనను సాకుగా తీసుకుని ఉత్తర వియత్నాంపై అమెరికా విమాన దాడులను ముమ్మరం చేసింది.

లిటిల్‌ గ్రీన్‌ మెన్‌

2014లో క్రిమియాను రష్యా ఆక్రమించిన తొలినాళ్లలో రష్యన్‌ సైనికుల మాదిరిగా ఆకుపచ్చ యూనిఫారాలు ధరించిన వ్యక్తులు క్రిమియా వీధుల్లో కనిపించేవారు. వాటిపై రష్యా సైన్య అధికార చిహ్నాలు ఉండేవి కావు. వారు రష్యా ఆయుధాలను చేతపట్టి తిరిగేవారు. వీరిని స్థానికులు లిటిల్‌ గ్రీన్‌మెన్‌ అని పిలిచేవారు. క్రిమియాను ఉక్రెయిన్‌ ఆధీనం నుంచి తప్పించి రష్యా హస్తగతం చేయడమే వారి పని.

ఇదీ చదవండి: ఉక్రెయిన్​ సైన్యంపై బాంబుల వర్షం.. భయంతో పరుగులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.