ETV Bharat / international

పెంపుడు జంతువులతో పోలింగ్​ కేంద్రాలకు బ్రిటన్​ ఓటర్లు

బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల ఓటింగ్​లో పెంపుడు జంతువులు ఆకర్షణగా నిలిచాయి. ప్రధాని బోరిస్ జాన్సన్, లండన్ మేయర్ సాదిక్ ఖాన్ తమ శునకాలను పోలింగ్ కేంద్రాలకు వెంటతెచ్చుకున్నారు. ఇది చూసిన ఇతర ఓటర్లూ తమ పెంపుడు జంతువులను వెంటతీసుకెళ్లారు. ప్రజలందరూ తమ పెంపుడు జంతువులతో ఫొటోలు, వీడియోలు పంచుకోవడం వల్ల ఓటింగ్ సమయంలో #డాగ్స్​ఎట్​పోలింగ్​స్టేషన్స్​ అనే హాష్​ట్యాగ్​ ట్విట్టర్​లో ట్రెండింగ్​గా మారింది.

UK voters flock to voting stations with their pets
పెంపుడు జంతువులతో పోలింగ్​ కేంద్రాలకు బ్రిటన్​ ఓటర్లు
author img

By

Published : Dec 13, 2019, 5:31 AM IST

Updated : Dec 13, 2019, 10:09 AM IST

పెంపుడు జంతువులతో పోలింగ్​ కేంద్రాలకు బ్రిటన్​ ఓటర్లు

పెంపుడు జంతువులపై అమితాసక్తి కలిగిన దేశాల్లో బ్రిటన్ ఒకటి. ఈ ఆసక్తిని కనబరుస్తూ ఆ దేశ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ సార్వత్రిక ఎన్నికల ఓటింగ్​కు తన పెంపుడు కుక్కతో వచ్చారు. లండన్ వెస్ట్​మినిస్టర్ నియోజకవర్గంలోని మెథొడిస్ట్ సెంట్రల్ హాల్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బోరిస్ సతీమణి కేరీ సైమండ్స్ తనతో పాటు ఓటు వేశారు. ఈ ఏడాది ప్రారంభంలో ఎనిమల్ వేల్స్ అనే చారిటీ నుంచి ఈ పెంపుడు కుక్కను దత్తత తీసుకున్నారు.

లండన్ మేయర్ సాదిక్ ఖాన్ తన పెంపుడు కుక్కతో కలిసి ఓటింగ్ కేంద్రానికి వెళ్లిన వీడియోను ట్విట్టర్​లో పంచుకున్నారు. ప్రజలందరు ఓటు హక్కు వినియోగించుకోవాలని అభ్యర్థించారు.

#డాగ్స్​ఎట్​పోలింగ్​స్టేషన్స్

ఇలా నేతలు తమ కుక్కలతో పోలింగ్ స్టేషన్​లో దర్శనమిచ్చిన అనంతరం ప్రజలూ తమ పెంపుడు జంతువులతో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వినూత్న దుస్తులతో అలంకరించిన తమ పెంపుడు జంతువుల చిత్రాలను ప్రజలు సామాజిక మాధ్యమాలలో పంచుకున్నారు. దీంతో ట్విట్టర్​లో "#డాగ్స్​ఎట్​పోలింగ్​స్టేషన్స్"​ అనే హాష్​ట్యాగ్​ ట్రెండింగ్​గా మారింది.

డాగ్స్ ట్రస్ట్ సూచనలు

పెంపుడు జంతువులను తీసుకెళ్తున్న ఓటర్లకు డాగ్స్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ పలు సూచనలు చేసింది. అసిస్టెంట్ కుక్కలు కాకుండా మిగితా శునకాలను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతి లేదని తెలిపింది. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లినప్పుడు బయట తమ పెంపుడు కుక్కలను చూసుకోవడానికి ఒకరిని వెంటతెచ్చుకోవాలని సూచించింది. రాత్రివేళ ఓటింగ్​కు వచ్చినప్పుడు వెలుతురు ప్రతిబింబించే దుస్తులను ధరించాలని పేర్కొంది.

ఇదీ చూడండి: ఇన్ఫోసిస్​కు ఐరాస 'క్లైమేట్​ న్యూట్రల్​ నౌ' అవార్డు

New Delhi, Dec 12 (ANI): Equity benchmark indices mirrored global sentiment and extended gains after making a positive start on Thursday. The Union Cabinet's nod to Insolvency and Bankruptcy Code amendment and the government's approval to a partial credit guarantee scheme for government-owned banks to purchase high-rated pooled assets from financially sound non-banking finance companies boosted the investor sentiment. The BSE SandP Sensex surged ahead by 169 points at 40,582 while the Nifty 50 ticked up by 62 points at 11,972.
Last Updated : Dec 13, 2019, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.