ETV Bharat / international

టీకా వేసుకుంటే డేటింగ్ యాప్స్​లో స్పెషల్​ బోనస్! - బ్రిటన్​

కరోనా టీకా వేసుకునేందుకు ప్రజల్ని ప్రోత్సహించడానికి బ్రిటన్​లో ఆన్​లైన్​ డేటింగ్​ యాప్స్​ ముందుకు వచ్చాయి. యూకే ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యాయి.

Covid jabs
డేట్​ యాప్​తో కరోనా టీకా
author img

By

Published : Jun 8, 2021, 1:31 PM IST

బ్రిటన్​లో కరోనా టీకాను ఎక్కువ మంది వేసుకునేలా డేటింగ్​ యాప్స్​ ప్రచారం కల్పిస్తున్నట్లు వెల్లడించాయి. ఇందుకోసం తాము ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ప్రకటించాయి.

యూజర్లు డేటింగ్ ప్రొఫైల్స్​లో టీకాకు తమ మద్దతును చూపించడానికి ప్రత్యేక ఫీచర్​ తీసుకువస్తున్నట్లు యాప్​ నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా ఆ ఫీచర్​లో టీకాలు వేసుకున్నట్లు తెలిపితే వారికి బోనస్‌లు ఇస్తామని ప్రకటించారు.

ఇదే అంశంపై సర్వే నిర్వహించగా... వాక్సిన్ వేయించుకున్న వారితో డేట్​కు వెళ్లడానికి 31 శాతం మంది అంగీకరించారు. టీకా వేసుకోకపోతే డేటింగ్​కు వెళ్లే ప్రసక్తేలేదని మరో 28 శాతం మంది వెల్లడించారు.

బ్రిటన్​లో సుమారు కోటి మంది ప్రజలు డేటింగ్ యాప్స్​ ఉపయోగిస్తున్నారు. తాజా అధికారిక గణాంకాల ప్రకారం యూకేలో 4 కోట్లకు పైగా ప్రజలు, లేదా మూడొంతుల మంది పెద్దలు తొలి డోసు కరోనా వ్యాక్సిన్​ వేయించుకున్నారు.

ఇదీ చదవండి: Third Wave of Corona: అక్కడ మూడో ఉద్ధృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.