ఇంధన కొరత సమస్యను పరిష్కరించేందుకు బ్రిటిష్ సర్కార్... సైన్యాన్ని రంగంలోకి దింపుతోంది. సుమారు 200 మంది మిలిటరీ ట్యాంకర్ సిబ్బందిని.. సోమవారం నుంచి ఇందుకోసం వినియోగించనుంది.
'ఆపరేషన్ ఎస్కలిన్'
ట్రక్కు డ్రైవర్ల కొరత కారణంగా బ్రిటన్‌లో ఇంధన కొరత(Fuel Crisis UK) తలెత్తింది. ఫలితంగా ఇంధనం కోసం ప్రజలు పెట్రోల్ స్టేషన్ల వద్ద బారులు తీరుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు 'ఆపరేషన్ ఎస్కలిన్' పేరిట సైనిక సిబ్బందిని బ్రిటన్ ప్రభుత్వం వినియోగించనుంది. ఈ మేరకు శనివారం ప్రకటించింది.
ప్రస్తుతం వీరంతా శిక్షణ పొందుతున్నారని, సోమవారం నుంచి ఇంధన రవాణాలో పాల్గొంటారని తెలిపింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డాయని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లోనే.. ఇంధన కొరత(UK Fuel Crisis) ఉందని పేర్కొంది. చాలా చోట్ల డిమాండ్ కంటే అధికంగా సరఫరా ఉన్నట్లు తెలిపింది.
ఇదీ చదవండి: China Power Shortage: ప్రపంచ ఫ్యాక్టరీకి కరెంటు దెబ్బ