ETV Bharat / international

పాత టీబీ టీకాతో కరోనాకు చెక్​!

క్షయ వ్యాధి చికిత్స కోసం గతంలో వినియోగించిన బీసీజీ టీకా.. కరోనాపై పోరులో ఏ మేరకు ఉపయోగపడుతుందనే అంశంపై బ్రిటన్​లో పరిశోధనలు జరగనున్నాయి. ఆరోగ్య కార్యకర్తలపై ట్రయల్స్​ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. సానుకూల ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు పరిశోధకులు.

UK to begin trials to test if anti-TB BCG vaccine works against COVID-19
పాత టీబీ టీకాతో కరోనాకు చెక్​!
author img

By

Published : Oct 12, 2020, 11:50 AM IST

కరోనాకు వ్యాక్సిన్​ను కనుగొనేందుకు ప్రపంచ దేశలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. టీకాను అభివృద్ధి చేసేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాయి. తాజాగా.. క్షయ వ్యాధితో పోరాడేందుకు గతంలో వినియోగించిన బీసీజీ (బాసిల్లస్​ కాల్మెట్టె-గ్యురిన్​) వ్యాక్సిన్​.. కరోనాకు ఉపయోగపడుతుందా? లేదా? అనే అంశంపై బ్రిటన్​ పరిశోధనలు చేపట్టనుంది. ఇందుకోసం ఆరోగ్య కార్యకర్తలను నియమించుకునే పనిలో ఉంది.

ఈ పరిశోధనలకు.. నైరుతి ఇంగ్లాండ్​లోని ఎక్సెటర్​ విశ్వవిద్యాలయం నేతృత్వం వహిస్తోంది. బ్రేస్​ (బీసీజీ వ్యాక్సినేషన్​ టు రెడ్యూస్​ ది ఇంపాక్ట్​ ఆఫ్​ కొవిడ్​-19 ఇన్​ హెల్త్​ వర్కర్స్​) పేరుతో ట్రయల్స్​ను నిర్వహిస్తోంది.

"కరోనా వైరస్​ ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలమందిని బలిగొంది. 3 కోట్లమందికిపైగా దీని బారినపడ్డారు. సాధారణ పరిస్థితుల్లో బీసీజీ.. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుందన్నది తెలిసిన విషయమే. కరోనాపైనా ఇది ప్రభావం చూపుతుందని మేము అనుకుంటున్నాం. దీనిపై భారీ స్థాయిలో పరిశోధనలు చేపట్టేందుకు ఉత్సాహంగా ఉన్నాం. ఇది ఫలిస్తే.. తక్కువ ఖర్చుతోనే ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చు."

--- జాన్​ కాంప్​బెల్​, ఎక్సెటర్​ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్​

బ్రిటన్​లో బీసీజీ వ్యాక్సిన్​ను తొలిసారిగా 1920లో ఇచ్చారు. సాధారణ జనాభాలో టీబీ రేటు తగ్గడం వల్ల 2005లో దీనిని నిలిపివేశారు.

ఇదీ చూడండి:- రెండో వ్యాక్సిన్​ను రిజిస్టర్‌ చేయనున్న రష్యా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.