ETV Bharat / international

కరోనా చికిత్సకు తొలి అడుగు- యాంటీబాడీ గుర్తింపు! - corona virus latest research

కరోనా వైరస్​పై పోరాడే పూర్తి మానవ యాంటీబాడీని పరిశోధకులు ఆవిష్కరించారు. సార్స్​-కోవ్​ యాంటీబాడీలపై పరిశోధనల్లో ఈ విషయాన్ని గుర్తించింది ఐరోపాకు చెందిన పరిశోధకుల బృందం. ఇవి కరోనా వైరస్​ను సమర్థంగా నిరోధించగలవని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

antibodies
యాంటీబాడీ
author img

By

Published : May 5, 2020, 6:01 AM IST

మానవ శరీరంలోని సంప్రదాయ కణాలకు కరోనా వైరస్ సోకకుండా నిరోధించే మోనోక్లోనల్ యాంటీబాడీని పరిశోధకులు గుర్తించారు. కరోనా మహమ్మారికి చికిత్స చేసేందుకు పూర్తి స్థాయి మానవ ప్రతినిరోధకాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఈ అధ్యయనాన్ని తొలి అడుగుగా చెప్పవచ్చు.

ఇందుకు సంబంధించిన పరిశోధన వివరాలు జర్నల్ నేచర్ కమ్యూనికేషన్ల్​లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనాన్ని అట్రెక్ట్ విశ్వవిద్యాలయం, ఎరాస్మస్ వైద్య కేంద్రం, హార్బర్ బయోమెడికల్ (హెచ్​బీఎం) సంయుక్తంగా నిర్వహించాయి.

గత పరిశోధనల ఫలితమే..

2002లో ఉద్భవించిన సార్స్​-కోవ్​ వైరస్ మీద గతంలో చేసిన ప్రయోగాల ఆధారంగా ఈ పరిశోధన చేశారు. ఈ క్రమంలోనే మోనోక్లోనల్ యాంటీబాడీలను గుర్తించినట్లు తెలిపారు.

"సార్స్​-కోవ్​ ప్రతినిరోధకాల సేకరణలో భాగంగా సంప్రదాయ కణాల్లో సార్స్​-కోవ్​-2 (కరోనా వైరస్)ను తటస్థీకరించే యాంటీబాడీలను గుర్తించాం. ఇటువంటి యాంటీబాడీలే ఆతిథ్య కణాల ఇన్ఫెక్షన్​ను నిర్మూలించగలుగుతాయి. ఇన్పెక్షన్​ సోకని కణాలనూ రక్షిస్తాయి."

- బెరెండ్ జాన్ బోష్, పరిశోధకుడు

ఈ యాంటీబాడీకి సార్స్​, కరోనా వైరస్​లను పట్టి ఉంచే సామర్థ్యం ఉందని.. ఫలితంగా వీటిని తటస్థీకరించగలదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా అసాధారణ గుణాలున్న యాంటీబాడీలతో భవిష్యత్తులో ఉద్భవించే మహమ్మారులను కూడా నిర్మూలించవచ్చని బోష్ పేర్కొన్నారు.

హెచ్​2ఎల్​2 సాంకేతికతతో..

కరోనా చికిత్స విధానాన్ని రూపొదించటంలో ఈ పరిశోధన ఎంతగానో ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ యాంటీబాడీలతో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని చెబుతున్నారు.

సాధారణంగా సంప్రదాయ చికిత్స విధానానికి సంబంధించి యాంటీబాడీలు ఇతర జీవుల్లోనే అభివృద్ధి చెందుతాయి. అనంతరం వాటిని మానవుల్లో ప్రవేశపెడతారు. ప్రస్తుత యాంటీబాడీని హెచ్​2ఎల్​2 ట్రాన్స్​జెనిక్ మౌస్ సాంకేతికతతో పూర్తి స్థాయి మానవ యాంటీబాడీగా రూపొందించిట్లు పరిశోధకులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.