ETV Bharat / international

ఆడపిల్లకు జన్మనిచ్చి కరోనాతో నర్సు మృతి

కరోనా మహమ్మారి అప్పుడే పుట్టిన శిశువుకు తల్లి లేకుండా చేసింది. ఈ వైరస్​ వ్యాప్తి తరుణంలో నర్సుగా ఎందరికో సేవలందించిన ఆమెనే కొవిడ్​-19 పొట్టన పెట్టుకుంది. కరోనా సోకిన ఆమె ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చి మరణించింది.

UK pregnant nurse dies from coronavirus, but baby saved
ఆడపిల్లకు జన్మనిచ్చి కరోనాతో గర్భిణీ మృతి
author img

By

Published : Apr 16, 2020, 2:35 PM IST

ఎంతోమందికి సేవలందించిన ఆ నర్సు కరోనా ధాటికి మృత్యువాత పడింది. నిండు గర్భిణిగా ఉన్న ఆమె ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చి ఆదివారం మృతి చెందింది. కాగా ఆ బిడ్డ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఆ పసిపాపకు కరోనా సోకిందా అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు.

లండన్‌కు ఉత్తరాన ఉన్న లూటన్ అండ్ డన్‌స్టేబుల్ యూనివర్శిటీ హాస్పిటల్‌లోని జనరల్ వార్డులో మేరీ అగైవా అగ్యాపాంగ్ (28) నర్సుగా పనిచేసేది.

" బెడ్​ఫోర్డ్​షైర్​ ఆస్పత్రిలో ఈనెల 5న పరీక్ష నిర్వహించగా​ అగ్యాపాంగ్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఆమె 7వ తేదీన ఆస్పత్రిలో చేరింది. ఆదివారం మేరీ మరణించింది. మేరీ ఐదేళ్లగా ఇక్కడే పనిచేస్తుంది. చాలా మంచి వ్యక్తి. మేరీ కుటుంబం, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం."

-- డేవిడ్​ కార్టర్, ఎన్​హెచ్​ఎస్​ ఫౌండేషన్ ట్రస్ట్

రక్షణ పరికరాలు తక్కువే

యూకేలో కరోనా వైరస్​ వ్యాప్తి పెరుగుతుండగా ఆరోగ్య సిబ్బందికి సరిపడా రక్షణ పరికరాలు అందుబాటులో లేవు. దీనివల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

వైరస్​ను అధిగమించిన వృద్ధురాలు

బ్రిటన్​లో కరోనా మహమ్మారిని 106 ఏళ్ల కొన్నీ టిచెన్​ అనే వ్యక్తి అధిగమించారు. ఈ వయసులో కరోనా నుంచి సురక్షితంగా బయటపడ్డ మొదటి వ్యక్తి ఈమె. సెంట్రల్​ ఇంగ్లాండ్​లోని బర్మింగ్​ హోమ్​లోని సిటీ హాస్పిటల్​ వైద్యులు ఆమెకు మూడు వారాల పాటు వైద్య సేవలు అందించారు.

ఇదీ చదవండి: లాక్​డౌన్​ ముగిశాక కొత్త రూల్స్​ ఇవే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.