బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కారు ప్రమాదానికి గురైంది. లండన్‌లోని పార్లమెంట్ గేటు సమీపంలో ప్రధాని కాన్వాయ్ వెళుతున్న సమయంలో నిరసనకారులు ఒక్కసారిగా కాన్వాయ్ వైపు దూసుకు రావటం వల్ల ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
" భద్రత చర్యల్లో భాగంగా రక్షణ వాహనాలు వెళ్తున్నాయి. ఓ వ్యక్తి అకస్మాత్తుగా రోడ్డుపైకి రావటం వల్ల వాహనాలు ఒక్కసారిగా నిలిపివేయాల్సి వచ్చింది. దాంతో రెండు కార్లు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరికి హాని జరగలేదు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం."
- పోలీసులు
ప్రతి వారం నిర్వహించే ప్రశ్నోత్తరాల సెషన్స్‌కు ప్రధాని హాజరై తిరిగి వెళుతున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు డౌనింగ్ స్ట్రీట్ వెల్లడించింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో జాన్సన్ కారు ధ్వంసమైన ఫొటోలు వైరల్‌గా మారిన క్రమంలో ఈ మేరకు స్పందించింది డౌనింగ్ స్ట్రీట్.
ఇదీ చూడండి: సరిహద్దులో గస్తీ కాస్తున్న త్రివిధ దళాలు 'హై అలర్ట్'