బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు (Boris Johnson Mother) మాతృవియోగం కలిగింది. ప్రొఫెషనల్ పెయింటర్ అయిన ఆయన తల్లి చార్లెట్ జాన్సన్ వాల్(79) (Charlotte Johnson Wahl) తుది శ్వాస విడిచారు. లండన్‌లోని ఓ ఆస్పత్రిలో ఆమె సోమవారం మరణించారని ది డెయిలీ టెలిగ్రాఫ్ వార్తా పత్రిక వెల్లడించింది.
చార్లెట్ జాన్సన్ వాల్.. తన 40 ఏళ్ల వయసులో పార్కిన్సన్ వ్యాధి బారిన పడ్డారు. అప్పటి నుంచి దీనికి చికిత్స తీసుకుంటున్నారు.
చార్లెట్ మృతి పట్ల బ్రిటన్‌లోని రాజకీయ నాయకులు, ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. బోరిస్‌కు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు.
బోరిస్ అనుబంధం
తన తల్లిని బోరిస్.. ఎంతో గౌరవించేవారు. ఇంట్లో సంపూర్ణ అధికారం తన తల్లి చేతుల్లోనే ఉంటుందని గతంలో ఓసారి గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరి జీవితం ఎంతో విలువైనదన్న విషయాన్ని తనకు నేర్పించేవారని చెప్పారు.
ఇదీ చదవండి: అఫ్గానీలకు అండగా నిలబడతాం: భారత్