ETV Bharat / international

కరోనా లాక్​డౌన్​ 2.0 ఉల్లంఘిస్తే కఠిన చర్యలు! - World covid-19 cases

ప్రపంచదేశాల్లో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. లాక్​డౌన్​2.0ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ ప్రజలను హెచ్చరించింది బ్రిటన్​ ప్రభుత్వం.

UK minister warns of tough fines as England enters second lockdown
కరోనా లాక్​డౌన్​ 2.0 ఉల్లంఘిస్తే కఠిన చర్యలు!
author img

By

Published : Nov 5, 2020, 9:20 PM IST

ప్రపంచ దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4కోట్ల 85 లక్షల 70 వేలకు చేరువైంది. ఇప్పటివరకు 12 లక్షల 33 వేలమందికి పైగా మహమ్మారి ధాటికి బలయ్యారు.

ఇప్పటికే కొన్ని దేశాధినేతలు కరోనా బారినపడి కోలుకున్నారు. తాజాగా స్వీడన్​ ప్రధాని స్టీఫన్​ లోఫ్వెన్​ కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆయనకు సన్నిహితంగా ఉన్న ఓ వ్యక్తికి కరోనా పరీక్షలో నెగిటివ్ వచ్చినప్పటికీ.. లోఫ్వెన్​ హోం ఐసోలేషన్​లోకి వెళ్లారు. వీలైనంత త్వరలో కరోనా టెస్ట్​ చేయించుకుంటానని తెలిపారు లోఫ్వెన్​.

కఠిన చర్యలే..

విపరీతంగా కరోనా కేసులు నమోదు కావడం వల్ల రెండో లాక్​డౌన్ విధించింది బ్రిటన్​. ఈ నేపథ్యంలో బ్రిటన్​ ప్రజలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రెండోసారి విధించిన లాక్​డౌన్​ను ఉల్లంఘిస్తే భారీగా జరిమానా విధించడమే కాకుండా.. కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రజలు ఇళ్లలోనే ఉండి కరోనా వ్యాప్తి నియంత్రణకు సాయపడాలని అధికారులు సూచించారు. ఈ లాక్​డౌన్ డిసెంబర్​ 2 వరకు అమల్లో ఉంటుంది.

2021లో ఈయూ వృద్ధి రేటు

కరోనా వ్యాప్తి కారణంగా ఐరోపా సమాఖ్య(ఈయూ) వృద్ధి రేటును తగ్గించింది ఈయూ ఎగ్జిక్యూటివ్​ కమిషన్​. ఆర్థిక వృద్ధి.. 2023 వరకు కొవిడ్​ ముందుస్థాయికి చేరుకోవడం కష్టమేనని పేర్కొంది. 2021లో 19 దేశాల్లో 4.2 శాతం మాత్రమే వృద్ధి రేటు నమోదవుతుందని అంచనా వేసింది. ఇది గతంలో 6.1 శాతంగా అంచనా వేసింది.

వివిధ దేశాల్లో కేసుల వివరాలు..

  • పోలెండ్​లో ఒక్కరోజే 27,143 కేసులు వెలుగుచూశాయి. మరో 367మంది చనిపోయారు.
  • రష్యాలో కొత్తగా 19,404 మందికి కరోనా సోకగా.. 292మంది మరణించారు.
  • మెక్సికోలో తాజాగా 635మంది మరణించగా.. మరో 5,225మంది కొవిడ్​ బారినపడ్డారు.
  • ఇరాన్​లో ఒక్కరోజే 8,772మంది వైరస్​ బారినపడ్డారు. మరో 406మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బెల్జియంలో కొత్తగా 14,903 కేసులు నమోదయ్యాయి. 205మంది కొవిడ్ ధాటికి బలయ్యారు.
  • ఉక్రెయిన్​లో తాజాగా 9,850 మందికి కరోనా సోకింది. మరో 193మంది చనిపోయారు.

ఇదీ చూడండి: అమెరికా ఎన్నికలపై చైనా 'శాంతి' మంత్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.