ETV Bharat / international

'లాక్​డౌన్​ కంటే శవాల గుట్టలే మేలు!' - బ్రిటన్​ ప్రధాని

మూడోసారి లాక్​డౌన్​పై వివాదస్పద వ్యాఖ్యలు చేసినట్లు వస్తున్న వార్తల్ని ఖండించారు బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​. గతేడాది చివరిలో.. 'లాక్​డౌన్​ కంటే గుట్టలు గుట్టలుగా మృతదేహాలు పేరుకుపోయినా ఫర్వాలేదని, అదే మేలు' అని బోరిస్​ చెప్పినట్లు ఓ మీడియా పేర్కొంది.

Boris Johnson
బోరిస్​
author img

By

Published : Apr 27, 2021, 8:59 AM IST

దేశంలో మూడోసారి లాక్​డౌన్​ విధించడం కంటే.. గుట్టలు గుట్టలుగా మృతదేహాలు పేరుకుపోయినా ఫర్వాలేదని, అదే మేలు అని తాను చెప్పినట్లుగా మీడియాలో వచ్చిన ఓ కథనాన్ని బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ ఖండించారు. అవి పూర్తిగా చెత్త ఆరోపణలు అని ఆయన మండిపడ్డారు.

రెండోసారి లాక్​డౌన్​ విధించిన సందర్భంగా 2020 చివరిలో జాన్సన్​ ఈ వ్యాఖ్యలు చేశారంటూ డైలీ మెయిల్​ ఇటీవల తన కథనంలో పేర్కొంది. ఇందుకు సంబంధించి ఆ పత్రిక ఎలాంటి ఆధారాలు పేర్కొనలేదు. కాకపోతే జాన్సన్​ కార్యాలయం నుంచి ఈ లీకులు వచ్చినట్లు తెలిపింది. దీనిపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.

ఇదీ చూడండి: భారత్​కు బాసటగా విదేశాలు- వైద్య పరికరాలు సరఫరా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.