ETV Bharat / international

బ్రెగ్జిట్: యూకే ఆర్థిక భవితకు 'కరోనా'​ గండం! - brexit issue

జనవరి 31.... బ్రిటన్ చరిత్రలో ఎంతో ప్రత్యేకమైన రోజు. ఐరోపా సమాఖ్యను వీడి రేపటి నుంచే కొత్త ప్రయాణం ప్రారంభిస్తుంది యూకే. ఇకపై బ్రిటన్​ ప్రస్థానం​ ఎలా ఉండనుంది? ఆ దేశ ఆర్థిక భవిష్యత్​ను ప్రభావితం చేసే అంశాలేంటి? చైనాలో పుట్టిన కరోనా వైరస్​కు, బ్రిటన్​ ప్రగతి రథానికి లింకేంటి?

brexit
బ్రెగ్జిట్
author img

By

Published : Jan 30, 2020, 2:11 PM IST

Updated : Feb 28, 2020, 12:52 PM IST

బ్రెగ్జిట్​... అంతర్జాతీయంగా చారిత్రక పరిణామం. కొన్నేళ్లుగా బ్రిటన్​ రాజకీయం తిరుగుతోంది ఈ అంశం చుట్టూనే. ఎట్టకేలకు బ్రెగ్జిట్​ పూర్తయ్యేందుకు రంగం సిద్ధమైంది. జనవరి 31న 28 దేశాల ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్​ అధికారికంగా వైదొలగనుంది.

అసలు సవాలు అదే...

బ్రెగ్జిట్​పై చర్చ 2010 నుంచి జరుగుతోంది. 2015 సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ విజయం తర్వాత ముందడుగు పడింది. ఈయూలో బ్రిటన్​లో ఉండాలో లేదో తేల్చేందుకు 2016 జూన్​ 23న రెఫరెండం నిర్వహించింది అప్పటి డేవిడ్ కామెరూన్​ ప్రభుత్వం. 51.9% ఓటర్లు బ్రెగ్జిట్​కే జైకొట్టారు. తీర్పు వచ్చింది కానీ... అమలు చేయడానికి చాలా కాలం పట్టింది. మధ్యలో ప్రధాని మార్పు వంటి ఎన్నో నాటకీయ పరిణామాలు. ఎట్టకేలకు ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు రంగం సిద్ధమైంది. అయినా... కథ ఇక్కడితో అయిపోలేదు.

ఈయూ నుంచి విడిపోయాక... కూటమి దేశాలు సహా ఇతర దేశాలన్నింటితో బ్రిటన్​ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు 11 నెలలు(డిసెంబర్​ 31వరకు) గడువు. వేర్వేరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలు, కరోనా వైరస్ వ్యాప్తి వంటి అంతర్జాతీయ పరిణామాల మధ్య ఈ ప్రక్రియ పూర్తి చేయడం బ్రిటన్​కు అసలు సవాలు. కొన్నేళ్లుగా సంక్షోభాల సవారీ చేస్తున్న దేశాన్ని పూర్తిస్థాయిలో గాడినపెట్టి, ఆర్థిక స్థిరత్వం సాధించడం ప్రధాని బోరిస్​ జాన్సన్​కు అగ్నిపరీక్ష.

ప్రస్తుతం బ్రిటన్​ పరిస్థితి ఏంటి?

బ్రిటన్​ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటోంది. జీడీపీ వృద్ధి రేటు క్షీణించడం, పెట్టుబడులు తగ్గడం ఆందోళనకర విషయమైతే... నిరుద్యోగం రేటు రికార్డు స్థాయి కనిష్ఠానికి దిగిరావడం సానుకూలాంశం. 2016 బ్రెగ్జిట్​ రెఫరెండం తర్వాత భారీగా పతనమైన పౌండ్​ విలువ ఇటీవల గణనీయంగా పుంజుకోవడం మరో విశేషం. మౌలిక వసతుల కల్పనకు భారీ స్థాయిలో ఖర్చు పెడతామన్న ప్రకటన కార్యరూపం దాల్చితే ఆర్థిక రథం మరింత వేగంగా ముందుకు సాగే అవకాశముంది. 2016 ఆగస్టు తర్వాత తొలిసారిగా ఇప్పుడు బ్యాంక్ ఆఫ్​ ఇంగ్లాండ్​ వడ్డీ రేట్లు తగ్గించడం ఈ వృద్ధికి మరింత ఊతమివ్వనుంది.

బ్రిటన్​ ఆర్థిక వ్యవస్థ ఈ స్థాయిలో కోలుకోవడానికి ఇటీవల ఎన్నికల అనంతరం దేశంలో నెలకొన్న రాజకీయ స్థిరత్వమే కారణమన్నది నిపుణుల మాట. అయితే... ఈ వృద్ధి ఇలానే కొనసాగకపోవచ్చన్నది వారి విశ్లేషణ.

నిర్దేశించేది ఆ రెండే....

దేశీయ పరిస్థితులు అనుకూలంగానే ఉన్నా.... అంతర్జాతీయ అంశాలు బ్రిటన్​ ఆర్థిక భవితకు కీలక సవాళ్లుగా మారాయి. వాటిలో ప్రధానమైనవి... అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, కరోనా వైరస్. రెండూ చైనాతో ముడిపడినవే. ఈ రెండు అంశాలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావంపై బ్రిటన్​ ప్రగతి గాథ ఆధారపడి ఉంటుంది.

"2020 ఆరంభంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. కానీ... ఆ తర్వాత ఆ జోరు కొనసాగడం చాలా కష్టం."

-హోవర్డ్ ఆర్చర్, ఈవై ఆర్థికవేత్త

బ్రెగ్జిట్​ వ్యవహారం మొదలైనప్పటి నుంచి వృద్ధి రేటు తగ్గుతూ వస్తోంది. 2017లో 1.8శాతంగా ఉన్న జీడీపీ వృద్ధి రేటు 2019కి 1.3శాతానికి క్షీణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.2శాతం వృద్ధి రేటు నమోదు కావచ్చని అంచనా వేసింది బ్యాంక్ ఆఫ్​ ఇంగ్లాండ్. ఇది నిజం అవుతుందా లేక అంతర్జాతీయ పరిణామాలతో లెక్క మారుతుందా అన్నది వేచిచూడాలి.

ఇదీ చూడండి: రేపే బ్రెగ్జిట్​ : బ్రిటన్​కు​ యూరోపియన్​ పార్లమెంట్​​ వీడ్కోలు

Intro:Body:Conclusion:
Last Updated : Feb 28, 2020, 12:52 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.