ETV Bharat / international

ఒమిక్రాన్ కలవరం.. 30 ఏళ్లు దాటినవారికీ బూస్టర్‌ డోసు

Uk covid boosters: ఒమిక్రాన్ వేరియంట్​ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో... 30 ఏళ్లు పైబడిన వారికీ కరోనా టీకా బూస్టర్ డోసులు అందించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు.. యూకేలో ఒమిక్రాన్​ కట్టడికి అదనపు రక్షణ చర్యలు తీసుకోకపోతే భారీ ప్రాణనష్టం తప్పదని.. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి 25వేల నుంచి 75వేల మరణాలు సంభవించే అవకాశం ఉందని తాజాగా ఓ అధ్యయనం హెచ్చరించింది.

UK COVID boosters
30 ఏళ్లు దాటినవారికీ బూస్టర్‌ డోసు
author img

By

Published : Dec 13, 2021, 5:39 AM IST

Uk covid boosters: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో బ్రిటన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 30 ఏళ్లు పైబడిన వారికీ బూస్టర్‌ డోసులు అందించడానికి సిద్ధమైంది. దీనికి సంబంధించి సోమవారం నుంచి బుకింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే 40 ఏళ్లకు పైబడిన 2 కోట్ల మందికి బూస్టర్‌ డోసులు అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Covid vaccination in britan: 30 నుంచి 39 ఏళ్ల మధ్య వయస్కులు సుమారు 75 లక్షల మంది ఉండగా, అందులో 35 లక్షల మందిని బూస్టర్‌ డోసుకు అర్హులుగా తేల్చారు. బూస్టర్‌ డోసుతో ఒమిక్రాన్‌ నుంచి రక్షణ పెరుగుతుందని అధ్యయనాల్లో తేలిన నేపథ్యంలో, బ్రిటన్‌ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన వాటిని పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది.

ఇదీ చూడండి: బూస్టర్‌ డోసు వేసుకున్నా వదలని 'ఒమిక్రాన్‌'!

'ఏప్రిల్‌ నాటికి 75వేల 'ఒమిక్రాన్‌' మరణాలు'

Uk omicron cases: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ దక్షిణాఫ్రికాలో ఉద్భవించినప్పటికీ.. దీని వ్యాప్తి బ్రిటన్‌లోనే అధికంగా ఉన్నట్లు లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌, ట్రాపికల్‌ మెడిసిన్‌ కొద్దిరోజుల క్రితమే తెలిపింది. ఇదిలా ఉండగా అదనపు రక్షణ చర్యలు తీసుకోకపోతే యూకేలో భారీ ప్రాణనష్టం తప్పదని.. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి 25వేల నుంచి 75వేల మరణాలు సంభవించే అవకాశం ఉందని తాజాగా వెల్లడించింది. ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య 60 శాతం పెరగనున్నట్లు తెలిపింది. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌, ట్రాపికల్‌ మెడిసిన్‌తోపాటు దక్షిణాఫ్రికాలోని స్టెల్లెన్‌బోష్ విశ్వవిద్యాలయం పరిశోధకులు సంయుక్త అధ్యయనంలో ఈమేరకు తెలిపారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి తీవ్రత, టీకాల ప్రభావం ఆధారంగా వారు ఈ అధ్యయనం చేశారు.

"ఇంగ్లాండ్‌లో ఒమిక్రాన్‌ వ్యాప్తి తీవ్రరూపం దాల్చి కేసులు గణనీయంగా పెరుగనున్నట్లు ఫలితాలు వెల్లడిస్తున్నాయి. కఠిన నియంత్రణ చర్యలు లేకపోతే.. 2020-21 సమయంలో ఆల్ఫా వేరియంట్‌ విజృంభించినప్పుడు నమోదైన కేసుల కంటే అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒమిక్రాన్‌ వ్యాప్తి తీవ్రత అధికంగా ఉంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఇది సులువుగా సోకే అవకాశం ఉంది"

-లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌, ట్రాపికల్‌ మెడిసిన్‌

Omcirona in britan: ఇంగ్లాండ్‌లో ఒమిక్రాన్‌ తీవ్రరూపం దాలుస్తోంది. శనివారం ఒక్కరోజే దాదాపు 600 కేసులు బయటపడ్డాయి. కాగా రాబోయే రెండు నుంచి నాలుగు వారాల్లో స్థానికంగా బయటపడే మొత్తం కేసుల్లో సగం ఒమిక్రాన్‌ కేసులే ఉంటాయని భావిస్తున్నట్లు బ్రిటన్‌ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ కొద్దిరోజుల క్రితమే తెలిపింది. గత రెండు వారాల్లో నమోదైన కేసుల వృద్ధి రేటు ఆధారంగా ఈ అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుత ఉద్ధృతి ఇలాగే కొనసాగితే.. ఈ నెలాఖరుకు కేసుల సంఖ్య పది లక్షలు దాటొచ్చని ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ సైతం ఇటీవలే హౌస్ ఆఫ్ కామన్స్‌కు తెలిపారు.

ఇదీ చూడండి: దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి కరోనా- ఒమిక్రాన్​ వేరియంటేనా?

ఇదీ చూడండి: చాపకింద నీరులా కరోనా- 'ఒమిక్రాన్​'తో ఆంక్షల్లోకి దేశాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.