భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల పేదలను ఆదుకోవడానికి విరాళాలు సేకరించేందుకు వర్చువల్ ఫెస్టివల్‌ను నిర్వహించనుంది బ్రిటన్ను చెందిన యాక్షన్ విలేజ్ ఇండియా(ఏవీఐ) ఛారిటీ. శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఏటా ఘనంగా నిర్వహించే ఈ ఫెస్టివల్‌ను కరోనా కారణంగా ఈ ఏడాది రద్దు చేశారు. విరాళాల కోసం ఆన్లైైన్లోనే వేడుకను నిర్వహిస్తున్నారు.
భారత్‌లోని పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి గత 25ఏళ్లకుపైగా ఇక్కడి మారుమూల గ్రామాల్లోని పేదలకు సాయం అందిస్తోంది ఏవీఐ. మహిళలు, చిన్నారులకు ఉన్న హక్కులు పొందేలా చేసి వారి జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు దోహదపడుతోంది. లింగ, కుల, మతాలతో సంబంధం లేకుండా అందరూ భూమి, నీరు, విద్య వంటి హక్కులు పొందెందుకూ తన వంతు చేయూత అందిస్తోంది.
వర్చువల్ ఫండ్రైసర్ కార్యక్రామాన్ని మద్రాస్ కేఫ్ స్వచ్ఛంద సంస్థ ప్రారంభించనున్నట్లు ఏవీఐ తెలిపింది. ప్రపంచ ప్రఖ్యాత వరల్డ్ ఆఫ్ మ్యూజిక్, ఆర్ట్, డ్యాన్స్ ఉత్సవాల్లో గత 25 ఏళ్లుగా మద్రాస్ కేఫ్ ఉనికిని కలిగి ఉందని పేర్కొంది.
ఈసారి నిర్వహించే వర్చువల్ వేడుకలో పలు రకాల ఫుడ్ రెసిపీలు, కళా ప్రదర్శనలు, యోగా సెషన్లకు సంబంధించిన కంటెంట్ డిజిటల్‌గా అందుబాటులో ఉంటుందని ఏవీఐ వివరించింది.