ETV Bharat / international

కరోనాకు పిల్​తో చెక్- ఆ మాత్రల వినియోగానికి యూకే ఓకే - కొవిడ్ మోల్నుపిరవిర్

కరోనా చికిత్స కోసం మాత్ర (Pills for Covid treatment) అందుబాటులోకి వచ్చింది. మెర్క్ ఫార్మా తయారు చేసిన మాత్ర వినియోగానికి.. బ్రిటన్ నియంత్రణ సంస్థ అనుమతులు జారీ చేసింది.

molnupiravir
కొవిడ్ పిల్
author img

By

Published : Nov 4, 2021, 4:38 PM IST

Updated : Nov 4, 2021, 4:56 PM IST

కరోనా చికిత్సకు తొలిసారి మాత్ర (Pills for Covid treatment) అందుబాటులోకి వచ్చింది. మోల్నుపిరవిర్ పేరుతో మెర్క్ ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన ఈ పిల్.. కరోనాపై సమర్థంగా పోరాడుతోందని తేలింది. కరోనా బాధితుల కోసం దీన్ని వినియోగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

కొవిడ్ బారిన పడ్డ వయోజనుల కోసం ఈ పిల్స్​ వినియోగించవచ్చు. అయితే కరోనా రిస్క్ ఫ్యాక్టర్​లలో ఏదో ఒకటి బాధితులకు ఉంటేనే వీటిని తీసుకోవాలని యూకే నియంత్రణ సంస్థ పేర్కొంది. ఐదు రోజుల పాటు రోజుకు రెండు సార్లు ఈ మాత్రను తీసుకోవాల్సి ఉంటుంది.

అమెరికా ఎఫ్​డీఏ వద్ద మోల్నుపిరవిర్ దరఖాస్తు పెండింగ్​లో ఉంది. దీనికి అనుమతులు లభించకముందే చాలా వరకు దేశాలు మాత్రల కోసం ముందస్తు ఆర్డర్లు ఇచ్చేశాయి.

మెరుగైన ఫలితం...

ప్రముఖ అంతర్జాతీయ ఫార్మా సంస్థ మెర్క్‌.. ఈ ఔషధాన్ని మోల్నుపిరవిర్ పేరుతో రూపొందించింది. ఇది ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలు చూపించినట్లు సంస్థ వెల్లడించింది. కొత్తగా వైరస్‌ బారినపడుతున్న బాధితులకు ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలను సగానికి తగ్గించినట్లు పేర్కొంది. మాత్రల రూపంలో తీసుకొచ్చిన ఈ ఔషధం అత్యవసర వినియోగం కోసం అమెరికా సహా పలు దేశాల్లో దరఖాస్తు చేసుకుంది.

మోల్నుపిరవిర్‌ వల్ల కలిగే దుష్ప్రభావాలు చాలా సాధారణంగా ఉన్నట్లు నిపుణులు వెల్లడించారు. కొవిడ్‌ చికిత్సలో వినియోగిస్తున్న ఇంజెక్షన్‌ రూపంలో ఉన్న మందుల కంటే మాత్రల రూపంలో ఉన్న ఈ ఔషధం బాధితులకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Nov 4, 2021, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.