Ukraine Russia talks: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరిగిన మూడో విడత శాంతి చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే ముగిశాయి. అయితే ఉక్రెయిన్‌లోని మానవతా కారిడార్ల ఏర్పాటులో కొంత పురోగతి సాధించినట్లు ఉక్రెయిన్ ప్రతినిధి బృందం సభ్యుడు మైఖైలో పోడోల్యాక్ తెలిపారు. కాల్పుల విరమణ, భద్రతా పరమైన హామీలతో పాటు వివాదాల పరిష్కారం కోసం తీవ్రమైన సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఆయన ట్వీట్ చేశారు.
అటు రష్యా ప్రతినిధులు కూడా ఈ చర్చలపై ప్రకటన చేశారు. రాజకీయ, సైనిక అంశాలపై చర్చలు కొనసాగాయని.. ఎలాంటి సానుకూల అంశాలు లేవనే సంకేతాలిచ్చారు.
ఆగని దాడులు..
మరోవైపు ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యా బాంబుల మోత ఆపలేదు. కాల్పు విరమణ అంటూనే యుద్ధాన్ని కొనసాగించింది. రష్యా సైనిక బలగాలు రాజధాని కీవ్ సహా ఉక్రెయిన్ నగరాలపై రాకెట్ లాంఛర్లు, బాంబులతో విరుచుకుపడ్డాయి. సోమవారం మకారివ్ ప్రాంతంలోని ఓ బేకరిపై రష్యా జరిపిన దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, 30 మంది గాయపడ్డారు.
ఇదీ చూడండి: 4నగరాల్లో కాల్పులకు విరామం- మిగతా చోట్ల విధ్వంసం