కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్లో సాగుతున్న రైతు ఉద్యమంపై ఐక్యరాజ్య సమితిలోని మానవ హక్కుల కమిషన్ కార్యాలయం(ఓహెచ్సీహెచ్ఆర్) స్పందించింది. పాలనాయంత్రాంగం, ఆందోళనాకారులు గరిష్ఠ సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది.
అందరి మానవ హక్కులను తగు రీతిలో గౌరవిస్తూ సమస్యలకు నిష్పాక్షిక పరిష్కార మార్గాలను కనుగొనాలని కోరింది. శాంతియుతంగా సమావేశామయ్యేందుకు, భావ వ్యక్తీకరణకు ఉద్దేశించిన హక్కులను ఆఫ్లైన్లోనూ, ఆన్లైన్లోనూ పరిరక్షించాలని విజ్ఞప్తి చేసింది.
ఇదీ చూడండి: నేడు రైతుల చక్కాజామ్- దిల్లీ పోలీసులు అప్రమత్తం