ETV Bharat / international

రాజధానిలోనే అత్యంత ఇరుకైన ఇల్లు- ధర రూ. 17.5 కోట్లు! - అత్యంత ఇరుకైన నివాసం

నాలుగు అడుగుల వెడల్పుతో అత్యంత ఇరుకైన ఇల్లుగా గుర్తింపు పొందిన ఓ నివాసం అమ్మకానికి వచ్చింది. అయితే దాని ధర రూ. 17.5కోట్లుగా ఉండటం విశేషం. ఇరుకుగా ఉండే ఇంటికి అంత ధర ఎందుకు? అని అనుకుంటున్నారా? అయితే ఈ కథ చదివేయండి..

house
హైజ్​
author img

By

Published : Aug 1, 2021, 2:04 PM IST

లండన్​ కెన్సింగ్టన్​లోని సిలోన్​ స్ట్రీట్​లో ఉంది ఆ ఇల్లు. దాని వెడల్పు నాలుగు అడుగులు. మొత్తం మీద 1,587 చదరపు అడుగుల్లో ఆ నివాసాన్ని నిర్మించారు. ఇప్పుడది రూ. 17.5కోట్లు పలుకుతోంది.

మొత్తం బ్రిటన్​ రాజధానిలోనే అత్యంత ఇరుకైన నివాసంగా గుర్తింపు పొందిన ఆ ఇల్లు.. రెండు ఇళ్ల మధ్య కుక్కినట్టుగా ఉంటుంది. బయటి నుంచి చూస్తే.. ఇలా ఉందేంటి? అని అనుకుంటారు. కానీ "డోంట్​ జడ్జ్​ ఎ బుక్​ బై ఇట్స్​ కవర్​" అనే ఆంగ్ల సామెతకు ఇది ఉదాహరణగా ఉంటుంది. సాధారణ నివాసంలో ఉండాల్సిన అన్ని సదుపాయాలు ఇందులో ఉన్నాయి. మూడు బెడ్​రూంలు, డైనింగ్​ హాల్​​, రిసెప్షన్​ రూం​, ఆధునిక కిచెన్​ సౌకర్యాలు ఇందులో ఉండటం విశేషం. ఇక పైన ఫ్లోర్​లో స్టడీ రూం కూడా ఉంది. దానినే ఆఫీస్​ రూం​లా కూడా వాడుకోవచ్చు. ఓ బాత్​రూం కూడా ఉంది. ఇంటి పై నుంచి కింది వరకు గాజుతో చేసిన విండోలు ఉన్నాయి. ఇక వెనకాలి భాగంలో ఓ గార్డెన్​ కూడా ఉండటం మరో ప్రత్యేకత.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ ఇంటిని 1987లో హెన్రీ హారిసన్​ అనే ఆర్కిటెక్ట్​ నిర్మించాడు. అయితే ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. ఈ ఇరుకైన ఇల్లు ఉండే ప్రాంతంలో ఎందరో ఏ-లిస్ట్​ సెలిబ్రిటీలు ఉంటున్నారు. ఆస్కార్​ విజేత డానియల్​ డే-లెవిస్​ ఒకప్పుడు ఇదే వీధిలో ఉండేవారు.

ఇదీ చూడండి:- రూ. 2లక్షలకు అమ్ముడుపోయిన 90పైసల 'చెంచా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.