ETV Bharat / international

'లాక్​డౌన్​లో బీరు​ కావాలా.. మీ ఇంటి వద్దకు పబ్​నే తెస్తాం' - beers

కరోనా భయంతో లాక్​డౌన్​ విధించడం వల్ల ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో బ్రిటన్​కు చెందిన ఓ బీర్ల తయారీ సంస్థ వినూత్న ఆలోచన చేసింది. ఇంటి వద్దకే పబ్​ను తీసుకొస్తుంది. మొబైల్​ పబ్​ గురించి వింటుంటే మనకూ ఇలాంటి సదుపాయం ఉంటే బాగుండు అనిపిస్తోంది కదూ..!

The pub brought to your door during lockdown
ఆ దేశంలో ఇంటింటికీ బీర్ల పంపిణీ!
author img

By

Published : Mar 28, 2020, 8:48 AM IST

'లాక్​డౌన్​లో బీర్​ కావాలా.. మీ ఇంటి వద్దకు పబ్​నే తెస్తాం'

బ్రిటన్​లోని ప్రజలకు ప్రతి చిన్న సంఘటనకు గుర్తొచ్చేది పబ్​. ఆనందమైనా, బాధైనా వెంటనే పబ్​కు వెళ్లిపోతారు. కానీ ఇప్పుడు వారికి ఆ అవకాశం లేకుండా పోయింది. ప్రపంచదేశాలతో పాటు బ్రిటన్​లోనూ కరోనా వ్యాప్తి క్రమంలో లాక్​డౌన్​ విధించింది అక్కడి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా బీరు​ చేతికందకా నిరాశ చెందుతున్నారు. అలాంటి వారికోసమే 'పబ్​ ఇన్​ ఎ బాక్స్'​ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సిగ్నేచర్​ బ్రూ అనే బీర్ల తయారీ సంస్థ. బీరు తాగాలని అనిపిస్తే చాలు.. వారి ఇంటి వద్దకే పబ్​ను తీసుకొస్తుంది.

బ్రిటన్​లో ఇంటివద్దకే బీరు​ను అందించడం ఇదే తొలిసారి అని నిర్వహకులు చెబుతున్నారు.

ప్రజలు ఇప్పటికీ బీరు​ తాగాలని కోరుకుంటున్నారని, ఇంట్లోనూ పబ్​ వాతావరణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారని నాకు అనిపిస్తోంది. బ్రిటన్​ ప్రజలు మంచి, చెడు ఎలాంటి సందర్భాల్లోనైనా పబ్​కు వెళతారు. నాకు జ్ఞాపకమున్నంత వరకు ఇలా పబ్​లకు రాలేకపోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం కరోనా కారణంగా చాలామంది తమ ఇళ్లల్లో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అందుకే పబ్​ను ఒక పెట్టెలో వారి ఇంటివద్దకే తీసుకెళ్లాలనే ఆలోచన వచ్చింది.

- టామ్​ బాట్​, సహ వ్యవస్థాపకుడు

వైరస్​ వ్యాప్తి కారణంగా ఉపాధి కోల్పోయిన సంగీత కళాకారులను డెలివరీ బాయ్స్​గా నియమించి.. వారికి సహాయం అందేలా చేస్తోంది సిగ్నెచర్​ బ్రూ సంస్థ.

ప్రస్తుతం ఒక పెట్టెలో 8 బీర్లతో సహా ఒక ప్యాకెట్​ స్నాక్స్​, బీరు మ్యాట్స్​, గ్లాసుల​ను అందించి.. అన్ని సౌకర్యాలతో లండన్​ వాసుల దాహార్తిని తీరుస్తోంది ఈ సంస్థ. వీటి ధర కేవలం 25 బ్రిటన్​ పౌండ్లు. ఇందులో వినోదం కోసం మ్యూజిక్​ క్విజ్​ కూడా ఉంచుతారు.

ఇదీ చదవండి: బ్రిటన్​, కెనడాలోనూ మోదీ చెప్పినట్లే చేసిన ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.