ETV Bharat / international

పక్షిలా ఎగురుతూ ఫ్రాన్స్​ నుంచి ఇంగ్లాండ్​కు! - 'హోవర్​బోర్డు'

పక్షిలా గాలిలో ఎగురుతూ.. ఫ్రాన్స్​ నుంచి ఇంగ్లాండ్​ చేరుకుని చరిత్ర సృష్టించారు 40 ఏళ్ల ఫ్రెంచ్​ ఆవిష్కర్త ఫ్రాంకీ జపాటా. తాను తయారు చేసుకున్న ప్రత్యేక 'హోవర్​బోర్డు' యంత్రం సహాయంతో ఈ ఘనతను సాధించారాయన.

పక్షిలా ఎగురుతూ ఫ్రాన్స్​ నుంచి ఇంగ్లాండ్​కు!
author img

By

Published : Aug 5, 2019, 6:57 AM IST

Updated : Aug 5, 2019, 8:12 AM IST

పక్షిలా ఎగురుతూ ఫ్రాన్స్​ నుంచి ఇంగ్లాండ్​కు!

మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించారు ఫ్రాన్స్​కు చెందిన ఫ్రాంకీ జపాటా అనే ఆవిష్కర్త. తాను సృష్టించిన హోవర్​బోర్డ్​ అనే యంత్రం సహాయంతో పక్షిలా ఎగురుతూ ఫ్రాన్స్​ నుంచి ఇంగ్లాండ్​ చేరుకుని చరిత్ర సృష్టించారు 40 ఏళ్ల జపాటా.

ఫ్రాన్స్​లోని సాంగెట్​లో బయల్దేరి ఇంగ్లీష్​ ఛానల్​ మీదుగా బ్రిటన్​లోని సెయింట్ మార్గరేట్​లో సురక్షితంగా దిగారాయన. మొత్తం 35 కిలోమీటర్ల ప్రయాణాన్ని.. 22 నిమిషాల్లో పూర్తి చేశారు. మధ్యలో ఒక సారి ఇంధనం నింపుకునేందుకు కిందకు దిగారు. 5 చిన్నపాటి జెట్ ఇంజిన్లున్న ఈ హోవర్​బోర్డు కిరోసిన్​తో పనిచేస్తుంది.

నిజానికి.. పది రోజుల క్రితమే ఇలా ఎగిరేందుకు ప్రయత్నించారు జపాటా. తొలి ప్రయత్నంలో కొన్ని నిమిషాల ప్రయాణం తర్వాత హోవర్​బోర్డ్​ విఫలమైంది. యంత్రం పూర్తిగా ధ్వంసమైంది. అయినప్పటికీ నిరాశ చెందకుండా హోవర్​బోర్డును జపాటా తిరిగి నిర్మించారు.

తాజాగా ఆగస్టు 4న రెండో ప్రయత్నంలో విజయం సాధించారు. తన కృషి ఫలించినందుకు జపాటా ఆనందానికి అవధుల్లేవు. ఇంగ్లీష్​ ఛానల్ దాటడం ఎంతో మధురమైన సందర్భంగా చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి: మలేషియా జూ పార్కులో ఫ్రెండ్​షిప్​ 'పాండా'

AP Video Delivery Log - 2300 GMT News
Sunday, 4 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2235: Mexico Texas Reactions 2 AP Clients Only 4223633
Mexico plans legal action against El Paso gun vendor
AP-APTN-2220: US El Paso March Must credit content creator 4223632
Moms Demand protest at White House after shooting
AP-APTN-2209: US OH Shooting Presser 2 Must credit "WKEF/WRGT"/No access Dayton market/No access by US broadcast networks/No re-sale, no re-use or archive 4223631
Police: Ohio shooter had 100-round magazine
AP-APTN-2112: US NJ Trump Departure AP Clients Only 4223630
Trump: 'Hate has no place in our country'
AP-APTN-2109: Saudi Hajj Parade AP Clients Only 4223629
SArabia demonstrates security readiness ahead of Hajj
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Aug 5, 2019, 8:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.