ETV Bharat / international

రాయిలా మారుతున్న చిన్నారి శరీరం! - శరీరం రాతిలా మారే వ్యాధి

చిన్నారులకు చిన్న సమస్య తలెత్తినా కన్నవారి మనసు తల్లడిల్లిపోతుంది. వారు మళ్లీ కోలుకునే వరకు కలవరపడుతూనే ఉంటారు. అలాంటిది తమ పాపాయి.. చికిత్స లేని అరుదైన వ్యాధిన బారిన పడిందనే తెలిస్తే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం కదా? బ్రిటన్​లో ఓ దంపతులు ఇప్పుడు అలాంటి ఆవేదనలోనే మునిగిపోయారు. వారి అయిదు నెలల చిన్నారి శరీరం రాయిలా మారుతూ ఉండటమే ఇందుకు కారణం.

baby body turning as stone
చిన్నారికి అత్యంత అరుదైన వ్యాధి
author img

By

Published : Jul 4, 2021, 5:12 AM IST

Updated : Jul 4, 2021, 6:57 AM IST

బుజ్జి బుజ్జి పాదాలు... చిన్ని చిన్ని చేతులు కదిలిస్తూ చిన్నారులు చేసే కేరింతలు.. లేలేత పెదాలపై విరబూసే బోసి నవ్వులు.. ఏ ఇంటనైనా ఆనందాల సిరులను కురిపిస్తాయి.. సంతోషాల సంబరాన్ని అందిస్తాయి. అలాంటి మురిపాల బుజ్జాయి.. అరుదైన, చికిత్సలేని వ్యాధి బారిన పడితే.. ఇక ఆ తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు బ్రిటన్​కు చెందిన అలెక్స్, దవె దంపతులు. అత్యంత అరుదైన రుగ్మతతో బాధపడుతున్న వారి అయిదు నెలల చిన్నారి లెక్సీ రాబిన్స్ శరీరం రాయిలా మారుతోంది.

20 లక్షల మందిలో ఒకరికి..

బేబీ లెక్సీ ఈ ఏడాది జనవరి 31న యూకేలోని హేమెల్ హెంప్​స్టెడ్, హెర్ట్​ఫోర్డ్​షైర్​లో జన్మించింది. పుట్టుకతోనే ఆమె జన్యు సంబంధిత రుగ్మతకు గురైంది. రోజులు గడిచే కొద్ది చిన్నారి శరీరంలో వస్తున్న మార్పులు తల్లిదండ్రులను కలవరానికి గురిచేశాయి. చేతి బొటన వేలు, కాలి బొటన వేలులో చలనం లేదని గుర్తించారు. వైద్యుల వద్దకు తీసుకెళితే నెలరోజుల పాటు వివిధ పరీక్షలు చేసి చివరకు ఫైబ్రోడిస్ ప్లాసియా ఓసిఫికన్స్ ప్రొగ్రెస్సివా(ఎఫ్ఓపీ) అని తేల్చారు. 20 లక్షల మందిలో ఒకరికి వచ్చే ఈ అరుదైన వ్యాధి వల్ల కండరాలు, సంధాన కణజాలాలు, ఎముకలను కలిపి ఉంచే లిగ్మెంట్ స్థానంలో ఎముకలు ఏర్పడతాయి. డొక్క(స్కెలిటన్) భాగం వెలుపలా ఎముకలు పుట్టుకొచ్చి కదలికలు లేకుండా అడ్డుకుంటాయి. చివరకు శరీరం చలనరహితమై రాయిలా మారుతుందని వైద్యులు తెలిపారు. ఇటువంటి వారు 40ఏళ్లు మాత్రమే జీవించగలరని, అందులోనూ సగానికి పైగా కాలం మంచానికే పరిమితమై ఉండాల్సి వస్తుందని వివరించారు.

'మా ప్రయత్నం వీడబోం'

ఏప్రిల్ లో ఎక్స్​రే తీసినప్పుడు లెక్సీ కాలి బొటనవేలి కీళ్లు కలిసిపోయినట్లు గుర్తించారు. ఆ చిన్నారి పరీక్ష నివేదికలను ప్రస్తుతం లాస్ ఏంజెలెస్​లోని ఓ ల్యాబ్​కు పంపించారు. "బ్రిటన్​లో ప్రసిద్ధి చెందిన చిన్నపిల్లల వైద్యుడు లెక్సీని పరిశీలిస్తున్నారు. తన 30 ఏళ్ల సర్వీసులో ఇలాంటి అరుదైన కేసు చూడలేదని ఆయన చెప్పారు. నా చిన్నారి చాలా తెలివైనది. రాత్రిళ్లు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా నిద్రపోతుంది. లెక్సీకి చికిత్సలేని జబ్బు సోకడం మా హృదయాలను కలిచివేస్తోంది. కానీ, మా ప్రయత్నం వీడబోం" అని తల్లిదండ్రులు తెలిపారు.

ఇదీ చూడండి: 16 CRORE INJECTION: చిన్నారికి అరుదైన వ్యాధి.. ఇంజక్షన్​కు రూ.16 కోట్లు కావాలి..!

ఇదీ చూడండి: పాప తల్లిదండ్రులెవరో తేల్చేందుకు డీఎన్​ఏ పరీక్షలు

Last Updated : Jul 4, 2021, 6:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.