ఇండోనేసియా రాజధాని జకార్తాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. వారం రోజుల క్రితం ఆ దేశ అవినీతి నిరోధక సంస్థకు అధికారాలను తగ్గించేలా పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందింది. అందుకు నిరసనగా విద్యార్థులు రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు చేపట్టారు.
అవినీతి నిరోధక సంస్థను నిర్వీర్యం చేసేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారంటూ మంగళవారం ప్లకార్డులు ప్రదర్శించారు విద్యార్థులు. టైర్లకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంటు భవనాన్ని ముట్టడించారు. కొత్త చట్టాన్ని రద్దు చెయ్యాలంటూ ఆగ్రహంతో రాళ్లు రువ్వారు.
ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు బాష్ప వాయువు గోళాలు, నీటి ఫిరంగులను ప్రయోగించారు పోలీసులు. ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో దాదాపు 80 మంది విద్యార్థులు గాయపడ్డారు.
ఇదీ చూడండి:విదేశీ విద్యార్థులు మెచ్చిన రాష్ట్రం ఏదో తెలుసా..?