కరోనా మృత్యుఘంటికలు మోగిస్తున్న బ్రిటన్‌లో ఆస్పత్రులు, జన సమ్మర్థ ప్రదేశాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని యూకే ఉగ్రవాద నిరోధక సంస్థ ఉన్నతాధికారి నిక్ ఆడమ్స్ తెలిపారు. ఈ మేరకు బ్రిటన్ ఆరోగ్య సేవా ట్రస్టుల్లో అదనపు భద్రత కల్పించాలని సూచించామన్నారాయన.
నిశిత పరిశీలన..
కరోనా సంక్షోభ సమయాన్ని దాడులకు ఉపయోగించుకోవాలని.. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నుతోందని బ్రిటన్ ఉగ్రవాద నిరోధక జాతీయ సమన్వయకర్త నిక్ ఆడమ్స్ వెల్లడించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడేందుకు చేసే అన్ని కుట్రలను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.
ఉగ్రదాడులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్న నిక్.. ఉగ్ర కుట్రలను తిప్పికొడతామని హెచ్చరించారు. ప్రజలను హింసకు ప్రేరేపించే వారి ఆధారాల కోసం వెతుకుతున్నామని వెల్లడించారు. ఇందుకోసం యూకే, యూఎస్, ఆస్ట్రేలియా, కెనెడా, న్యూజిలాండ్ దేశాలతో పర్యవేక్షణ చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: వైద్య సిబ్బంది భద్రతలో రాజీ పడేది లేదు: మోదీ