స్వీడన్‌కు చెందిన బాలిక, ప్రముఖ వాతావరణ ఉద్యమ కార్యకర్త గ్రెటా థెన్బెర్గ్ను ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న పెనుమార్పులపై ప్రపంచ దేశాల విధాన రూపకర్తలు నూతన విధానాలు రూపొందించాల్సిందిగా గ్లోబల్ యూత్ మూమెంట్ పేరుతో ఏడాది కాలంగా పోరాటం చేస్తోంది ఈ స్వీడన్ బాలిక.
‘వాతావరణ మార్పులపై అప్రమత్తం చేస్తూ మానవాళికి ఈ ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని గుర్తూ చేయడమే కాకుండా నేటితరం ఓ ఉద్యమాన్ని నడిపితే ఎలా ఉంటుందో గ్రెటా సూచించింది. అందుకే ఆమెను 2019 టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తించాం’ అని టైమ్స్ మ్యాగజిన్ చీఫ్ ఎడిటర్ ఎడ్వర్డ్ ఫెల్సెంథల్ తెలిపారు.
టైమ్స్ 'పర్సన్ ఆఫ్ ది ఇయర్'గా నిలవడంపై స్పందించింది గ్రెటా. తనకు దక్కిన గౌరవంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
-
Wow, this is unbelievable! I share this great honour with everyone in the #FridaysForFuture movement and climate activists everywhere. #climatestrike https://t.co/2t2JyA6AnM pic.twitter.com/u4JUD4cgCz
— Greta Thunberg (@GretaThunberg) December 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Wow, this is unbelievable! I share this great honour with everyone in the #FridaysForFuture movement and climate activists everywhere. #climatestrike https://t.co/2t2JyA6AnM pic.twitter.com/u4JUD4cgCz
— Greta Thunberg (@GretaThunberg) December 11, 2019Wow, this is unbelievable! I share this great honour with everyone in the #FridaysForFuture movement and climate activists everywhere. #climatestrike https://t.co/2t2JyA6AnM pic.twitter.com/u4JUD4cgCz
— Greta Thunberg (@GretaThunberg) December 11, 2019
"ఈ గౌరవం నాకు ఒక్కదానికే దక్కినది కాదు. నాతో పాటు పోరాడిన ప్రతి ఒక్కరికీ ఇందులో భాగస్వామ్యం ఉంది. మేం భవిష్యత్ కోసం ఏదైతే చేశామో అదంతా కలిసే చేశాం."
- గ్రెటా థెన్‌బెర్గ్, పర్యావరణ కార్యకర్త
"భూతాపం ఇలాగే కొనసాగితే మా భవిష్యత్ ఏంటీ" అంటూ అంతర్జాతీయ వేదికపై గళమెత్తింది..16 ఏళ్ల గ్రెటా థెన్‌బెర్గ్. "మా బాల్యాన్ని హరించడానికి మీకెంత ధైర్యం" అంటూ ప్రపంచ నేతలను గట్టిగా ప్రశ్నించింది. భూతాపానికి వ్యతిరేకంగా స్వీడన్ పార్లమెంట్ ఎదుట ఒంటరిగా దీక్ష చేపట్టి గతేడాది తొలిసారిగా వార్తల్లోకెక్కింది థెన్‌బెర్గ్.
1927 నుంచి ప్రతి సంవత్సరం టైమ్స్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులను ప్రకటిస్తోంది. పోర్చుగల్‌లోని లిస్బన్ తీరంలో ఆకాశంవైపు చూస్తున్న గ్రెటా చిత్రాన్ని టైమ్స్ ముఖచిత్రంగా ప్రచురించింది. దీనికి 'ది పవర్ ఆఫ్ యూత్' అని క్యాప్షన్ ఇచ్చింది.
ఇదీ చూడండి: 'పౌర' బిల్లుపై మోదీ హర్షం.. సోనియా ఫైర్