జపాన్ కొత్త రకం కరోనా వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథోనామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జపాన్ వైరస్ ప్రమాదకరం కాదన్నారు. ప్రస్తతం వెలువడుతున్న కొత్త రకం కరోనా వైరస్లు అంత ప్రభావాన్ని చూపటం లేదన్నారు. బ్రెజిల్ నుంచి వచ్చిన నలుగురిలో కొత్తరకం కరోనా వైరస్‌ను గుర్తించారు జపాన్ వైద్యులు.
"జపాన్ కొత్తరకం కరోనా వైరస్ గురించి డబ్ల్యూహెచ్ఓకు అక్కడి వైద్యులు వెల్లడించారు. వైరస్ వ్యాప్తి చెందిన కొద్ది.. అది వివిధ రకాలుగా రూపాంతరం చెందుతుంది. కానీ ప్రస్తుతం కొత్త రకం కరోనా వైరస్లు అంత ప్రభావాన్ని చూపటం లేదు."
--టెడ్రోస్ అథోనామ్, డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్
జపాన్ కరోనా వైరస్ సైతం..యూకే, దక్షిణాఫ్రికాలో ప్రబలిన కొత్త రకం కరోనా వైరస్ లాంటిదేనని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : గురువారం చైనాకు డబ్ల్యూహెచ్ఓ బృందం