క్రొయేషియా రాజధాని జాగ్రెబ్‌ను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రత నమోదైంది. జాగ్రెబ్ నగరానికి 46 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. భూకంపం కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు యూరోప్‌కు చెందిన జియోలాజికల్ సర్వే తెలిపింది. సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే సోమవారం సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రత నమోదైంది.
క్రొయేషియాతో పాటు సరిహద్దు దేశాలైన సెర్బియా, బోస్నియాలోనూ భూమి కంపించిందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇదీ చదవండి: 'అందరికీ వ్యాక్సిన్ అందేంత వరకు విశ్రమించం'