ETV Bharat / international

విద్యార్థుల 'పరీక్ష'ల్ని ఏ దేశం ఎలా రాసింది? - exams postponed in many countries

కరోనా దెబ్బకు దేశంలో పరీక్షలు ఒక్కొక్కటిగా రద్దవుతున్నాయి. సీబీఎస్​ఈ, ఐసీఎస్​ఈ బోర్డులు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. మరి కరోనా కాలంలో ఇతర దేశాలు అనుసరిస్తున్న వ్యూహాలేంటి? పరీక్షలను ఏ విధంగా నిర్వహిస్తున్నాయి?

Strategies opted by various countries regarding exams
కరోనా కాలంలో ప్రపంచదేశాల 'పరీక్ష' వ్యూహాలివే!
author img

By

Published : Jun 26, 2020, 6:56 PM IST

దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో సీబీఎస్​ఈ 10, 12వ తరగదుల పరీక్షలను రద్దు చేసింది. జూన్ 1 నుంచి 15 మధ్య జరగాల్సిన పరీక్షలు నిర్వహించలేమని స్పష్టం చేసింది. విద్యార్థులను కరోనా నుంచి రక్షించేందుకే పరీక్షలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సైతం ఆమోదించింది.

కరోనా మహమ్మారి బెడద ప్రపంచవ్యాప్తంగా ఉన్నందున ఇతర దేశాల సైతం పరీక్షలపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. చాలా దేశాలు పరీక్షలను రద్దు చేయగా.. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పరీక్షలను తప్పక నిర్వహించి తీరుతామని మరికొన్ని దేశాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇదీ చదవండి- సీబీఎస్​ఈ ఫైనల్​ మార్కులు లెక్కిస్తారిలా...

భారత్ సహా అంగోలా, ఇండోనేసియా, మాల్టా, మెక్సికో, మైక్రోనేసియా, మంగోలియా, వెనెజువెలా దేశాలు పరీక్షలను రద్దు చేసి ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తున్నాయి. అరబ్ దేశాలు మాత్రం పరిశుభ్రమైన వాతావరణంలో, వైరస్ నియంత్రణ చర్యలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని ప్రణాళికలు వేసుకుంటున్నాయి. ఈజిప్ట్, సిరియా, పాలస్తీనా, మొరాకో, జోర్డాన్ వంటి దేశాలు ఇప్పటికీ తమ వార్షిక విద్యా ప్రణాళికనే అనుసరిస్తున్నాయి.

పరీక్షల విషయంలో ఇతర దేశాల్లో అవలంబించిన విధానాలు.. ఎంచుకున్న మార్గాల వివరాలు ఇలా ఉన్నాయి.

జర్మనీ

సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్షలను యథావిధిగా నిర్వహించాలని జర్మనీ నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తిని తగ్గించేలా పాఠశాలలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఇటలీ

ఇప్పటివరకు దేశంలో పరీక్షలను వాయిదా గానీ, రద్దు చేస్తున్నట్లు గానీ ప్రభుత్వం ప్రకటించలేదు. అయితే దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని విద్యా శాఖ స్పష్టం చేసింది.

ఫ్రాన్స్

జాతీయ ఉపాధ్యాయ నియామక పోటీ పరీక్షలు జూన్, జులై నెలల్లో జరగాల్సి ఉంది. అయితే కొవిడ్-19 పరిస్థితుల కారణంగా ఇది వాయిదా పడే అవకాశం ఉంది.

లగ్జెంబర్గ్

ముందుగా నిర్ణయించిన తేదీల్లోనే సెకండరీ స్కూల్ పరీక్షలు జరగనున్నాయి. అయితే సిలబస్ పూర్తి కాలేదన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రశ్నాపత్రాలు రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు విద్యా శాఖ మంత్రి.

పోలాండ్

పాఠశాలల వార్షిక క్యాలెండర్​ను మార్చాల్సిన అవసరం లేదని ప్రభుత్వం సూచనప్రాయంగా తెలిపింది. అయితే దేశంలో ఉన్న ప్రత్యేక చట్టం ప్రకారం కరోనా వైరస్ వంటి వ్యాధులు వ్యాపించిన సమయంలో పరీక్షా తేదీలను మార్చే అధికారం విద్యా శాఖ మంత్రికి ఉంటుంది.

న్యూజిలాండ్

దక్షిణార్థ గోళంలోని దేశాలు పాటించే విద్యా సంవత్సరాన్ని న్యూజిలాండ్ అనుసరిస్తోంది. షెడ్యూల్ ప్రకారం నవంబర్​లో పరీక్షలు జరగాల్సి ఉంది. విద్యార్థులు డిజిటల్ మాధ్యమంలోనూ పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తోంది.

కజకిస్థాన్

పరీక్షలు రద్దు లేదా వాయిదా వేయడం అసాధ్యమని దేశ విద్యా శాఖ స్పష్టం చేసింది. డిస్టెన్స్ లెర్నింగ్ ప్రవేశపెట్టినా గానీ.. 11వ గ్రేడ్ తర్వాత నిర్వహించే యూనైటెడ్ నేషనల్ టెస్ట్​ సహా అన్ని పరీక్షలను పాత పద్ధతుల్లోనే నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

బ్రెజిల్

జాతీయ హైస్కూల్ పరీక్షలను సాధారణ పేపర్​ ఫార్మాట్​తో పాటు డిజిటల్​ మాధ్యమం ద్వారా నిర్వహించాలని బ్రెజిల్ నిర్ణయం తీసుకుంది. పరీక్ష విధానం మాత్రం మార్చబోమని స్పష్టం చేసింది.

కోస్టారికా

ఒక తరగతి నుంచి మరో తరగతికి ప్రమోట్ చేసే నేషనల్ అసెస్​మెంట్ పరీక్షలను ప్రస్తుతం నిర్వహిస్తోంది.

ఐర్లాండ్

మౌఖిక పరీక్షలతో పాటు ప్రాక్టికల్ పరీక్షలను రద్దు చేసింది ఐర్లాండ్.

నార్వే

జూనియర్, హైస్కూల్ చివరి సంవత్సర విద్యార్థులకు నిర్వహించే పరీక్షలు సహా చాలా వరకు జాతీయ పరీక్షలను రద్దు చేసింది. విద్యార్థులకు గ్రేడ్లను కేటాయించడానికి వారి ప్రదర్శనను క్రమం తప్పకుండా అంచనా వేయాలని సూచించింది. ప్రతి విద్యార్థి తన చదువును కొనసాగించేలా చూడాలని స్పష్టం చేసింది.

నెదర్లాండ్స్

మాధ్యమిక విద్య కోసం నిర్వహించే సంవత్సర చివరి పరీక్షలు కరోనా కారణంగా రద్దయ్యాయి. ప్రైమరీ స్కూళ్లలోని ప్రదర్శన ఆధారంగానే విద్యార్థులను ప్రమోట్ చేయనున్నారు.

యునైటెడ్ కింగ్​డమ్

సాధారణంగా మే, జూన్​లో జరిగే సెంకండరీ ఎడ్యుకేషన్ 'ఎ' లెవెల్ పరీక్షలను ఈ ఏడాది వాయిదా వేశారు. పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులకు సరైన వ్యవస్థ ఏర్పాటు చేసి, సురక్షితమైన వాతావరణంలో నిర్వహించడానికి సిద్ధమేనని ప్రభుత్వం ప్రకటించింది.

ఇండోనేసియా

జూనియర్, సీనియర్ సెకండరీ స్థాయి పాఠశాలల జాతీయ పరీక్షలను ఇండోనేసియా రద్దు చేసింది. గత ఐదు సెమిస్టర్లలో చూపించిన ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు మార్కులు కేటాయించనున్నారు.

జపాన్

యూనివర్సిటీ పరీక్షలు రెండు దఫాలుగా జరుగుతాయి. తొలి దశలో జాతీయ స్థాయిలో అందరికీ ఒకే పరీక్ష నిర్వహిస్తారు. ఇవి జనవరిలో యథావిధిగా పూర్తయ్యాయి. రెండో దశలో విశ్వవిద్యాలయాలు వేటికవే ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించుకుంటాయి. ప్రభుత్వం అభ్యర్థన ప్రకారం కొన్ని యూనివర్సిటీలు పరీక్షలు రద్దు చేసి.. జాతీయ స్థాయి పరీక్షల ఫలితాలనే పరిగణనలోకి తీసుకునేలా నిర్ణయం తీసుకున్నాయి.

ఉగాండా

పరీక్షలు నిర్వహించడానికి సరైన మౌలిక సదుపాయాలు లేనందున అన్ని పరీక్షలను రద్దు చేశారు. టర్మ్ 1 పూర్తి చేసుకున్న వారికి పరీక్షలేవీ ఉండవు. టర్మ్-2 వారికి మాత్రం మాక్ టెస్ట్ నిర్వహించనున్నారు.

యునైటెడ్ స్టేట్స్

కే-12 స్కూళ్లలో తప్పనిసరి పరీక్షలను రద్దు చేయడానికి రాష్ట్రాలకు అనుమతులిచ్చింది అమెరికా ఫెడరల్ ప్రభుత్వం . ఇది 2019-20 సంవత్సరానికి పరీక్షలను మినహాయించడానికి అవకాశం కల్పిస్తుంది.

కరోనా పరిస్థితులకు అనుగుణంగా చైనా, ఫిజి, ఇరాన్, నేపాల్, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సింగపూర్, శ్రీలంక, ఉజ్బెకిస్థాన్, వియత్నాం వంటి ఆసియా దేశాలు పరీక్షలను రద్దు చేయడం లేదా వాయిదా వేయడంపై నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేశాయి.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.