Worlds oldest man dies: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన సటుర్నినో డెలా ప్యుయెంటె మంగళవారం కన్నుమూశారు. ఆయన వయసు 112 ఏళ్లు.
1909లో ఆయన స్పెయిన్లోని లియోన్ శివార్లలో జన్మించారు. 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారు. ప్రపంచంలో అత్యధిక కాలం జీవించి ఉన్న వ్యక్తి ఈయనేనని గిన్నిస్ సంస్థ గతేడాది సెప్టెంబర్లో ధ్రువీకరించింది.
పదమూడేళ్ల వయసులోనే చెప్పులు కుడుతూ జీవన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయనకు ఎనిమిది మంది పిల్లలు. 14 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉండగా.. 22 మంది ముని మనవళ్లు, మనవరాల్లు ఉన్నారు.
ఇదీ చదవండి: హ్యామ్‌స్టర్‌లకు కరోనా.. చంపాలని ప్రభుత్వం నిర్ణయం..