ఇంట్లో తల్లిదండ్రులతో గొడవపడిన పిల్లలు సాధారంగా ఏం చేస్తారు? కాసేపు అలుగుతారు. తినడం మానేస్తారు. లేదా బయటకు వెళ్లి కోపం తగ్గాక తిరిగొస్తారు. కానీ స్పెయిన్‌కు చెందిన ఓ 14 ఏళ్ల కుర్రాడు చేసిన పని ఇంటర్నెట్ను ఊపేస్తోంది. అతడు ఏం చేశాడో చూడండి.
2015 మార్చిలో ఓ రోజు అమ్మానాన్నలతో గొడవపడ్డ అండ్రెస్ కాంటో.. ఇంటి వెనుక పెరట్లోకి వెళ్లాడు. తన తాత ఉపయోగించిన పార, చేతబట్టి తవ్వడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు తవ్వుతూనే ఉన్నాడు. అలా ఆరేళ్లపాటు శ్రమించి ఏకంగా భూగర్భంలోనే సొంత ఇంటిని నిర్మించుకున్నాడు.
2018 వరకు పారతో తవ్వుతూ బకెట్‌తో మట్టిని బయటపడేసే అండ్రెస్కు 2018 నుంచి తన మిత్రుడు అండ్రూ సహాకారం అందించాడు. అతడు తెచ్చిన డ్రిల్లర్, చిన్నాపాటి లిఫ్టింగ్ యంత్రంతో అండ్రెస్ పని మరింత సులభమైంది. ఇద్దరు వారానికి 14 గంటలు తవ్వారు.
ఈ యువకుడు నిర్మించిన అండర్‌గ్రౌండ్ ఇంటిని ట్విట్టర్లో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. కొన్ని న్యూస్ ఛానళ్లు అండ్రెస్ ఇంటర్వూ కూడా తీసుకున్నాయి.
తన ఇంట్లో ఇప్పుడు పడుకోవాడని బెడ్డు, వైఫ్ సదుపాయం కూడా ఉందని అండ్రెస్ చెబుతున్నాడు. బయట ఎంత వేడిగా ఉన్నా లోపల చల్లాగా ఉందంటున్నాడు. సరిగ్గా కరోనా పాండెమిక్ సమయానికి ఇల్లు సిద్ధమైందని చెబుతున్నాడు. వర్షాలు పడ్డప్పుడు మాత్రం ఇంట్లోకి పురుగులు, నత్తలు వస్తాయని వివరించాడు.
అయితే ఇంత శ్రమించి ఇల్లు కట్టుకోవాడనికి ప్రత్యేక కారణమేమైనా ఉందా అంటే.. తనకు గుర్తు లేదని బదులిచ్చాడు అండ్రెస్. కానీ ప్రతిరోజు అలసట లేకుండా తవ్వేందుకు తనంతట తానే స్ఫూర్తి పొందేవాడినని చెప్పాడు. తాను కాల్పనిక శక్తి ఉన్న కుర్రాడినని బదులిచ్చాడు.
-
Actualización de vídeo tour ;) pic.twitter.com/WunheXkwUt
— Kokomo (@andresiko_16) May 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Actualización de vídeo tour ;) pic.twitter.com/WunheXkwUt
— Kokomo (@andresiko_16) May 23, 2021Actualización de vídeo tour ;) pic.twitter.com/WunheXkwUt
— Kokomo (@andresiko_16) May 23, 2021