స్పెయిన్‌లో ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్ రాత్రి 8 గంటల వరకు సాగింది. ఈ ఎన్నికల్లో 'ఫార్ రైట్ పార్టీ వోక్స్' గెలిచి తొలిసారి పార్లమెంట్లో అధికారాన్ని చేజిక్కించుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పార్టీ ప్రాభవంతో పోలింగ్ శాతం భారీగా పెరిగింది.
ప్రస్తుత ప్రధాని పెడ్రో షాంచెజ్ గెలుస్తారనే ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీకి సంపూర్ణ మెజారిటీ అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు పెడ్రో. ఈ ఎన్నికల్లో అధికార సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి పెడ్రో షాంచెజ్ గెలుస్తారని, కాకపోతే ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే సంపూర్ణ మెజారిటీ రాకపోవచ్చని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి.
ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయి
ఫిబ్రవరిలో ప్రధాని 'పెడ్రో షాంచెజ్' ప్రతిపాదించిన బడ్జెన్‌ను రైట్‌వింగ్, సెవరేటిస్ట్ కాటలాన్ పార్టీలు తిరస్కరించినందున షాంచెజ్ ముందస్తు ఎన్నికలకు దిగారు.
గతేడాది జూన్‌లో పీపుల్స్ పార్టీ పై స్పానిష్ సోషలిస్ట్ వర్కర్స్ పార్టీ(పీఎస్ఓఈ) అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానంలో నెగ్గిన పీఎస్ఓఈ అధికారాన్ని చేపట్టింది.
మొత్తం 350 మంది సభ్యులున్న స్పానిష్ కాంగ్రెస్‌కు 2016 ఎన్నికల్లో... షాంచెన్ ప్రాతినిథ్యం వహిస్తున్న స్పానిష్ సోషలిస్ట్ వర్కర్స్ పార్టీ(పీఎస్ఓఈ) కేవలం 84సీట్లు మాత్రమే గెలుచుకుంది.