ETV Bharat / international

ఈయూ దేశాల్లో ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీ పునఃప్రారంభం! - European courtiers resume AstraZeneca COVID-19 vaccine news

ఆస్ట్రాజెనెకా టీకాను తాత్కాలికంగా నిలిపివేసిన ఐరోపా దేశాలు.. తిరిగి ప్రారంభించనున్నాయి. ఈ టీకా సురక్షితమేనని ఐరోపా సమాఖ్య ఔషధ నియంత్రణ సంస్థ(ఈయూఎంసీ) స్పష్టం చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Spain, Cyprus, Italy, France to resume use of AstraZeneca COVID-19 vaccine
ఈయూ దేశాల్లో ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీ పునఃప్రారంభం!
author img

By

Published : Mar 19, 2021, 5:13 AM IST

ఆస్ట్రాజెనెకా టీకా.. రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుందనే ఉద్దేశంతో తాత్కాలికంగా నిలిపివేసిన కొన్ని ఐరోపా దేశాలు తిరిగి ప్రారంభించనున్నాయి. ఈ టీకా సురక్షితమేనని ఐరోపా సమాఖ్య ఔషధ నియంత్రణ సంస్థ(ఈయూఎంసీ) స్పష్టం చేసిన తర్వాత స్పెయిన్, సిప్రస్, ఇటలీ, ఫ్రాన్స్​, జర్మనీ దేశాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి.

వచ్చే వారం నుంచి వ్యాక్సిన్​ పంపిణీని పునఃప్రారంభిస్తున్నట్లు స్పెయిన్​ ఆరోగ్య మంత్రి కరోలినా డారియాస్​ ప్రకటించారు. ఈ మేరకు ప్రాంతీయ ప్రభుత్వ ఆరోగ్య నిపుణులతో భేటీ అవుతామని తెలిపారు. వచ్చే బుధవారం నుంచి టీకా అందిస్తామని పేర్కొన్నారు. సిప్రస్​.. శుక్రవారం నుంచే టీకా పంపిణీ ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇటలీలోనూ వాక్సినేషన్ ప్రక్రియ తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

ఆస్ట్రాజెనెకా టీకాకు, రక్తం గడ్డకట్టడానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్న ఈయూఎంసీ.. టీకా పంపిణీ ఈయూ దేశాలు తిరిగి ప్రారంభించాలని సూచించింది.

ఇదీ చూడండి: ఆస్ట్రాజెనెకా టీకా సురక్షితమే: ఐరోపా సమాఖ్య

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.