రెండు ఊర్ల మధ్య మొదలైన గొడవ.. ఇప్పుడు పండుగలా మారింది. అందుకు స్పెయిన్ బాజా పట్టణం వేదికైంది. ఏటా ఇక్కడ 'కాస్కెమొర్రాస్ ఉత్సవం' నిర్వహిస్తారు. శుక్రవారం జరిగిన వేడుకల్లో 15 వేల మంది పాల్గొన్నారు. నల్ల రంగుతో పరస్పరం దాడులు చేసుకున్నారు.
ఈ సంప్రదాయం 15వ శాతాబ్దంలో ఒక గొడవతో మొదలైంది. గాడిక్స్కు చెందిన ఓ వ్యక్తికి బాజా ప్రాంతంలో ఒక బొమ్మ దొరికింది. అతడు దాన్ని తన గ్రామానికి తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ బాజాకు చెందిన వారు అందుకు నిరాకరించారు. రెండు ఊర్ల మధ్య బొమ్మ కోసం ఘర్షణ మొదలైంది. అది ప్రస్తుతం పండుగ రూపంలో కొనసాగుతోంది. నల్ల రంగు ఒంటికి అంటకుండా తప్పించుకుంటూ, బొమ్మను బాజా ప్రాంతాన్ని దాటించినవారే విజేత.
ఎంతో సరదాగా, ఉత్కంఠభరితంగా ఈ ఉత్సవం సాగుతుంది. గాడిక్స్ గ్రామస్థులు కాస్కెమొర్రాస్... అంటే దొంగల వేషధారణలో పరుగులు తీస్తారు. మూడురోజుల సమరంలో గాడిక్స్ గ్రామస్థులు బొమ్మను సొంతం చేసుకోవడంలో విఫలమయ్యారు. చివరకు బాజా ప్రజలే విజయం సాధించారు.
ఇదీ చూడండి:లైక్లు దాయనున్న ఫేస్బుక్.. ఎందుకో తెలుసా?