ETV Bharat / international

కరోనా కాలంలోనూ ఈ రెస్టారెంట్​లో హాయిగా తినొచ్చు!

కరోనా వ్యాప్తి నేపథ్యంలో హోటళ్లకు వెళ్లి తినాలంటేనే జనం భయపడుతున్నారు. అందుకే ఫుడ్​ డెలివరీ సంస్థలు కూడా పార్శిల్​ సేవలకే ఎక్కువగా మొగ్గుచూపుతున్నాయి. అయితే మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలోనూ ఓ రెస్టారెంట్​ జనాలకు ఆతిథ్యమిస్తోంది. అయితే ఇక్కడకి కేవలం ఒక్కరే వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి విచిత్రమైన నిబంధనతో నడుస్తోన్న రెస్టారెంట్​ గురించి తెలుసుకోవాలని ఉందా?

single table restaurant
సింగిల్‌ టేబుల్‌ రెస్టారెంట్​
author img

By

Published : Jul 3, 2020, 6:27 PM IST

కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇంకా లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ ఎక్కువ శాతం ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్స్‌, రెస్టారెంట్లు.. ఇలా జనసందోహం ఎక్కువగా ఉండే ప్రాంతాలన్నీ మూతపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ సామాజిక దూరం పాటించాలి, ఒక్కరే రావాలి అనే నియమాలతోనే ఓ రెస్టారెంట్​ను ప్రారంభించారు స్వీడన్‌కు చెందిన ఓ జంట. రెస్టారెంట్​లో సామాజిక దూరం.. అదెలా సాధ్యం అనేగా మీ సందేహం? అయితే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే..

రాస్మస్‌ పెర్సన్‌, లిండా కార్ల్‌సన్‌.. స్వీడన్‌లోని వార్మ్‌లాండ్‌ కౌంటీకి చెందిన ఈ భార్యాభర్తలు మే 10న 'టేబుల్‌ ఫర్‌ వన్‌' పేరుతో ఓ రెస్టారెంట్‌ని ప్రారంభించారు. అసలే స్వీడన్‌లో కేసులు ఎక్కువ అవుతుంటే వీళ్లు రెస్టరంట్‌ ఎలా ప్రారంభిస్తారు? అలా అయితే సామాజిక దూరం పాటించడం ఎలా సాధ్యమవుతుంది? అని ఆలోచిస్తున్నారా? అలాంటి భయాలేవీ లేకుండా అటు సామాజిక దూరం పాటిస్తూనే ఇటు రెస్టారెంట్​ను ప్రారంభించాలన్న ఆలోచన చేసిందీ జంట.

వినూత్న ఐడియా...

లాక్‌డౌన్‌ సమయంలో కార్ల్‌సన్‌ తల్లిదండ్రులు వారి ఇంటికి వచ్చారు. ఇల్లు కాస్త చిన్నదిగా ఉండడంతో.. అందులోనూ కరోనా సామాజిక దూరం పాటించాల్సి రావడం వల్ల రాస్మస్‌ ఇంటి పక్కన ఉన్న పొలంలో భోజనం ఏర్పాట్లు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని ఇలా భోంచేయడం ఎంతో ఆహ్లాదంగా ఉందని భావించిన రాస్మస్‌ ఈ 'టేబుల్‌ ఫర్‌ వన్‌' రెస్టరంట్‌కి నాంది పలికాడు.

single table restaurant
తాడు సాయంతో బాక్స్​ అందజేత

సింగిల్‌ టేబుల్‌.. సింగిల్‌ పర్సన్‌!

వృత్తిరీత్యా చెఫ్‌ అయిన తన భర్త రాస్మస్‌ ఆలోచనకు లిండా కూడా సహకరించింది. ఈ రెస్టారెంట్లో భాగంగా తమ ఇంటి పక్కన ఉండే పొలం మధ్యలో ఒక డైనింగ్‌ టేబుల్‌, దాని ముందు ఒక కుర్చీని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి రాస్మస్‌ ఇంటి వంటగదికి ఒక తాడు కట్టి.. దానికి ఓ బుట్ట వేలాడదీశారు. రెస్టారెంట్​కు వచ్చిన వాళ్లు ఆ టేబుల్‌ వద్ద కూర్చొని ఆర్డర్‌ ఇస్తే.. రాస్మస్‌ జంట వాటిని వండి వేడివేడిగా ఆ బుట్టలో వేసి టేబుల్‌ వద్దకు పంపుతుంది. ఇలా ఈ సింగిల్‌ టేబుల్‌ రెస్టారెంట్​లోకి ఒక రోజు కేవలం ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుందని చెబుతున్నారీ స్వీడిష్‌ కపుల్‌. మే 10న ప్రారంభించిన ఈ రెస్టరంట్‌ను ఆగస్టు 1 వరకు మాత్రమే అందుబాటులో ఉంచనున్నారట.

single table restaurant
ఫుడ్​ బాక్స్​
single table restaurant
ఆహారం

తోచినంత ఇవ్వచ్చు..

ఈ వినూత్న రెస్టరంట్‌ గురించి లిండా మాట్లాడుతూ.. "ఈ కరోనా కల్లోలం కారణంగా చాలామంది తమ ఉద్యోగాలను, ప్రియమైన వారిని కోల్పోయిన బాధలో ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఎందరో! అందుకే మేము మా రెస్టారెంట్​కు వచ్చిన వారు భోజనానికి ఇంత చెల్లించాలి అన్న నియమమేమీ పెట్టలేదు. ఎవరికి తోచినంత వారు ఇవ్వచ్చు.. ఒంటరిగా వచ్చిన వ్యక్తి ప్రశాంతంగా ఒక చోట కూర్చొని భోంచేసే అవకాశం మేం కల్పిస్తున్నామన్న సంతృప్తి మాకు చాలు.." అంటున్నారీ అందాల జంట. తమ రెస్టారెంట్​కు వస్తోన్న స్పందనను చూసి ఆగస్టు తర్వాత కొనసాగించాలా, వద్దా అన్న విషయం గురించి ఆలోచిస్తామంటున్నారీ కపుల్‌.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.