ETV Bharat / international

కొవిడ్​ టీకా మొదటి డోసు వేసుకున్న సింగపూర్ ప్రధాని - ప్రయాణికులపై బ్రిటన్ ఆంక్షలు

ఫైజర్​/బయో ఎన్​టెక్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా మొదటి డోసు వేసుకున్నారు సింగపూర్ ప్రధానమంత్రి లీ షియాన్ లూంగ్. దేశ ప్రజలకు అందించేందుకు తమ వద్ద సరిపడా డోసులున్నానాయని పేర్కొన్నారు. మరోవైపు అమెరికా, బ్రిటన్​ దేశాలు అభివృద్ధి చేసిన కొవిడ్​ టీకాలను వినియోగించబోమని ఇరాన్​ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న తరుణంలో ఇరాన్​ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Singapore PM receives COVID-19 vaccine
కొవిడ్​ టీకా మొదటి డోసు వేసుకున్న సింగపూర్ ప్రధాని
author img

By

Published : Jan 8, 2021, 9:02 PM IST

ఫైజర్/​బయోఎన్​టెక్ కొవిడ్​ టీకా మొదటి డోసు​ను వేసుకున్నారు సింగపూర్ ప్రధాని లీ షియాన్ లూంగ్. సింగపూర్​ జనరల్​ ఆసుపత్రిలో ​ శుక్రవారం ఈ టీకాను తీసుకున్నారు.

టీకా సమర్థంగా పనిచేస్తుందని, ఈ సమయంలో టీకా వేసుకోవడం చాలా ముఖ్యమని షియాన్​ లూంగ్ పేర్కొన్నారు. తమ వద్ద ఉన్న టీకా డోసులు దేశంలోని ప్రజలందరికీ సరిపోతాయని వెల్లడించారు.

టీకా వేసుకున్న సింగపూర్ ప్రధాని

ఐరోపా దేశాలు అప్రమత్తం..

కొవిడ్​ వ్యాప్తి తీవ్రంగా ఉన్న తరుణంలో ఐరోపా దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో 300 మిలియన్ల అదనపు కొవిడ్ టీకా డోసులు అందించాలని ఫైజర్​/బయోఎన్​టెక్​ను కోరింది యూరోపియన్ యూనియన్ కమిషన్. కొవిడ్​ను కట్టడి చేసే విషయంలో ఐరోపా దేశాలు విఫలమయ్యాయని విమర్శలు వస్తోన్న కారణంగా ఈయూ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లియెన్ వెల్లడించారు.

అమెరికా, బ్రిటన్​ వ్యాక్సిన్లపై నిషేధం!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇరాన్​ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అమెరికాలోని ఫైజర్​-బయోఎన్​టెక్​, బ్రిటన్​లోని ఆస్ట్రాజెనెకా సంస్థలు అభివృద్ధి చేసిన కొవిడ్​ టీకాలు తమ దేశంలో వినియోగించేదిలేదని ఇరాన్ నేత అయాతొల్లా అలీ కామెనేయ్ వెల్లడించారు. ఆ దేశాలపై తమకు నమ్మకం లేదని పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో ఇరాన్​ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

బ్రిటన్​లో కఠిన నిబంధనలు..

తమ దేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులపై కఠినమైన ఆంక్షలు విధించింది బ్రిటన్​ ప్రభుత్వం. బ్రిటన్​కు వచ్చే 72 గంటల ముందు తప్పనిసరిగా కొవిడ్​ పరీక్ష చేయంచుకోవాలని కోరింది. కరోనా కొత్త స్ట్రెయిన్​ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిబంధనలు పెట్టింది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారు భారీ జరిమానా కట్టాల్సి ఉంటుందని తెలిపింది.

ఇదీ చదవండి:మోడెర్నా టీకాకు బ్రిటన్​ ఓకే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.