రూబెన్ సింగ్... బ్రిటన్‌లో నివసించే భారత సంతతి బిలియనీర్. ఆయన జీవితం అత్యంత విలాసవంతం. ఖరీదైన కార్లు, వాచ్‌లు, డ్రెస్‌లు.. కావేవీ ఆయన కొనేందుకు అనర్హం. తాను అనుభవించే విలాసాల గురించి సామాజిక మాధ్యమాల్లో తరచూ పోస్ట్ చేస్తూ ఉంటారు రూబెన్ సింగ్. ఇన్‌స్టాగ్రామ్‌లో (Reuben Singh instagram) లక్షా 18 వేల మంది ఫాలోవర్లు ఉన్న ఆయన్ను.. అనుచరులు సరదాగా 'బ్రిటిష్ బిల్‌గేట్స్' అని పిలుచుకుంటారు. (Rolls Royce matching turban)

ఎవరైనా సరే సాధారణంగా డ్రెస్సులకు మ్యాచింగ్ ఉండాలని భావిస్తారు. వస్త్రాల రంగులకు సరిపోలే వాచీలు, షూ కోసం ప్రయత్నిస్తారు. మరి రాజభోగాలు అనుభవిస్తూ, విలాస జీవితాన్ని నలుగురికీ చూపించాలనుకునే రూబెన్ గురించి చెప్పాల్సిన పనేముంది. ఆయనా అంతే. కానీ, మన బ్రిటిష్ బిల్‌గేట్స్ మ్యాచింగ్.. ఏ బట్టలో, వాచీలకో పరిమితం కాదు. ఏకంగా కోట్లు విలువ చేసే కార్లనే (Reuben Singh Car collection) కొనుగోలు చేస్తుంటారు. అది కూడా తన తలపాగాకు సరిపోయే రంగుల్లోనివి.


మూడు రంగుల్లో ఆరు కార్లు
ఇలా తాజాగా ఆరు రోల్స్ రాయిస్ కార్లను కొన్నారు రూబెన్. (Reuben Singh Rolls Royce collection) ఇందుకోసం రూ.17.05 కోట్లు వెచ్చించారు. ఇందులో మూడు రోల్స్ రాయిస్ ఫాంటమ్, మూడు రోల్స్ రాయిస్ కలినన్స్ కార్లు ఉన్నాయి. ఫాంటమ్ కారు ధర రూ.3.35 కోట్లు కాగా.. కలినన్ ధర రూ.2.32 కోట్లు. ఈ ఆరు కార్లకు మూడు రంగులను వేయించారు.

టర్బన్ ఛాలెంజ్
ఇవే కాకుండా రూబెన్ గ్యారేజ్‌లో మొత్తం 15 రోల్స్ రాయిస్ కార్లు (Reuben Singh Rolls Royce collection) ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన కార్లుగా పరిగణించే రోల్స్ రాయిస్ల సంఖ్యే ఇంత ఉందంటే.. ఇక ఇతర లగ్జరీ కార్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదుగా! ఛారిటీ కోసం కొద్దిరోజుల క్రితం 'టర్బన్ ఛాలెంజ్'ను చేపట్టారు రూబెన్ సింగ్. వారం మొత్తం తలపాగా రంగుకు సరిపోలే రోల్స్ రాయిస్ కార్లలో ప్రయాణించడమే దీని ఉద్దేశం.

ఆదాయ మార్గం ఏంటో...
ఇంత విలాసవంతమైన జీవితం గడిపే రూబెన్.. (Reuben Singh net worth 2021) వృత్తిరీత్యా ఏం చేస్తుంటారని తెలుసుకోవాలని అనుకోవడం సహజమే (Reuben Singh source of income). లండన్ వేదికగా పనిచేసే ఆల్డేపీఏ (Reuben Singh alldayPA), ఇషర్ క్యాపిటల్ (Reuben Singh isher capital) అనే కంపెనీలకు రూబెన్ 'సీఈఓ'గా పనిచేస్తున్నారు. 19 ఏళ్లకే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి... 'మిస్ యాటిట్యూడ్' బ్రాండ్‌తో ఫ్యాషన్ రిటైల్ చైన్‌ను ప్రారంభించారు.

అన్ని కార్లు ఎందుకో..
అయినా, ఇన్ని రంగుల్లో కార్లను కొనాల్సిన అవసరమేముందని ఎవరైనా అనుకోవచ్చు. దీనికీ ధీటుగా సమాధానం చెప్తున్నారు రూబెన్. 'జీవితంలో మన కోసం మనం చేసుకునే ఎన్నో పనులను ఇతరులు ప్రశ్నిస్తారు. ఎందుకు?, ఎవరి కోసం?, కారణమేంటి? అన్న ప్రశ్నలు సంధిస్తారు. మన వల్ల ఎవరికీ ఇబ్బందులు కలగనప్పుడు, మోసం చేయనప్పుడు.. మనకు నచ్చింది చేయడమే మంచిది. ప్రతి ఒక్కరి ప్రశ్నలకు సమధానం చెప్పాల్సిన అవసరం లేదు' అని బదులిస్తున్నారు రూబెన్.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఏదేమైనప్పటికీ.. రూబెన్ జీవితం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. కొందరు మాత్రం ఆయన అభిరుచికి ఫిదా అవుతున్నారు.
ఇదీ చదవండి: