ETV Bharat / international

పోలీస్​ చర్యకు వ్యతిరేకంగా యూకేలో నిరసనలు - UK Home Secretary Priti Patel

బ్రిటన్​లో 33 ఏళ్ల సారా ఎవెరార్డ్​ కిడ్నాప్​, హత్య కేసులో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ కేసులో ఓ పోలీస్​ అధికారిని దోషిగా కోర్టు తేల్చటం వల్ల ప్రజలు రోడ్లపైకి వచ్చి పోలీస్​ చర్యలకు వ్యతిరేకంగా ఆందోళలు చేపట్టారు. ఈ ఘటనపై బ్రిటిష్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ స్పందించారు. సారా కుటుంబసభ్యుల గురించే ఆలోచిస్తున్నట్లు ట్విట్టర్​లో తెలిపారు.

Scotland Yard under fire over vigil policing, UK Home Secretary Priti Patel calls for full report
పోలీస్​కు వ్యతిరేకంగా యూకేలో భారీ నిరసనలు
author img

By

Published : Mar 15, 2021, 5:56 AM IST

యూకేలో 33 ఏళ్ల సారా ఎవెరార్డ్​ కిడ్నాప్, హత్య కేసులో నిరసనలతో బ్రిటన్ అట్టుడుకుతోంది. ఈ కేసులో ఓ పోలీస్​ అధికారిని మెట్రోపాలిటన్​ కోర్టు దోషిగా తేల్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పోలీసులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కరోనా నిబంధనలు లెక్కచేయకుండా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి పోలీస్ చర్యకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. నిరసనకారులు, పోలీసు​ల మధ్య జరిగిన ఘర్షణలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఈ ఘటనపై బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ స్పందించారు. సారా కుటుంబసభ్యుల గురించే ఆలోచిస్తున్నట్లు ట్విట్టర్​లో పేర్కొన్నారు. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామన్నారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయాలని యూకే హోమ్ సెక్రటరీ ప్రీతి పాటిల్.. అధికారులను ఆదేశించారు.

పోలీస్ చర్యకు వ్యతిరేకంగా యూకేలో భారీ నిరసనలు

మరోవైపు సారా మెమోరియల్​ ప్రాంతం వద్ద.. వేల సంఖ్యలో మద్దతుదారులు కూడి.. శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె సమాధి వద్ద పుష్పగుచ్ఛాలతో నివాళులు అర్పించారు.

మార్చి 3న.. బ్రిటన్​ సౌత్ లండన్​లోని క్లాఫమ్​ నుంచి బ్రిక్స్​టన్​కు నడుచుకుంటూ వెళ్తున్న సారా ఎవెరార్డ్​ కిడ్నాప్​కు గురయ్యారు. లండన్​ కు 100 కిలోమీటర్ల దూరంలోని వుడ్​ ల్యాండ్​ ప్రాంతంలో ఆమె మృతదేహం లభ్యమైంది.

ఇదీ చదవండి : పార్టీలో కాల్పులు- ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.