ETV Bharat / international

తుంపర్లే అని లైట్​ తీసుకోవద్దు.. అవే పెద్ద ముప్పు!

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మరో ముందడుగు వేశారు బ్రిటన్​ శాస్త్రవేత్తలు. తుంపర్ల ద్వారా వైరస్​ కణాలు శరీరంలోకి ప్రవేశించకుండా సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించారు. ఈ రక్షణ పరికరాలు చిన్న తుంపర్లను నిలువరించడం సహా.. ఇన్ఫెక్షన్​లనూ సమర్థంగా ఎదుర్కొంటుందని పరిశోధనాకర్తలు అభిప్రాయపడ్డారు.

Scientists decode how virus-carrying droplets disperse as infected people breathe
చిన్న తుంపర్లతోనే పెద్ద ముప్పు
author img

By

Published : Aug 6, 2020, 9:45 AM IST

కరోనా వైరస్​ సంక్రమణపై జరుగుతున్న పరిశోధనల్లో మరో మైలురాయి! బాధితులు ముక్కు, నోటి నుంచి వెలువడే తుంపర్లు ఈ వైరస్​ను మోసుకెళ్తుంటాయి. అయితే వివిధ పరిణామాల్లోని తుంపర్ల కదలికలు ఎలా ఉంటాయన్న విషయాన్ని మరింత లోతుగా తెలుసుకునేందుకు.. యూనివర్సటీ ఆఫ్​ ఈడెన్​ బర్గ్​ శాస్త్రవేత్తలు సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. ముఖ్యంగా గాలి ద్వారా కరోనా వ్యాపించే తీరును తెలుసుకునేందుకు ఇది ఉపకరిస్తుందని భావిస్తున్నారు.

ఏరోసోల్​ ఎక్స్​ట్రాక్టర్..

గణిత సిద్ధాంతాల ఆధారంగా రూపొందించిన ఈ కొత్త విధానాన్ని 'ఫిజిక్స్​ ఆఫ్​ ఫ్లూయిడ్స్​' పత్రిక విశ్లేషించింది. 'ముక్కు నుంచి వెలువడే తుంపర్ల పరిమాణం, వాటి ప్రయాణం మధ్య ఒకే విధమైన సంబంధం లేదు. మధ్యస్థాయి పరిమాణంలోని తుంపర్ల కంటే చిన్న, పెద్ద తుంపర్లే ఎక్కువగా ప్రయాణిస్తున్నాయి. ఆరోగ్య సిబ్బంది ధరించే వ్యక్తిగత రక్షణ పరికరాలు(పీపీఈలు) పెద్ద తుంపర్లను సమర్థంగా అడ్డుకోగలుగుతున్నాయి. కానీ, చిన్న తుంపర్లను మాత్రం నిలువరించలేకపోతున్నాయి. ఈ కారణంగానే.. చాలా మంది వైద్యులు కూడా మహమ్మారి బారినపడుతున్నారు. "తుంపర్ల ప్రవర్తననూ, మేం రూపొందించిన కొత్త విధానాన్ని ఆధారం చేసుకొని... ఏరోసోల్​ ఎక్స్​ట్రాక్టర్​ అనే పరికరాన్ని రూపొందించాం. ఇది తలవెంట్రుక కంటే తక్కువ వ్యాసముండే తంపర్ల నుంచి కూడా సమర్థంగా రక్షణ కల్పిస్తుంది. భవిష్యత్తులోనూ పలురకాల ఇన్ఫెక్షన్​ల నుంచి రక్షణ కల్పించేందుకు ఇది దోహదపడుతుంది." అని పరిశోధనకర్త ఫెలిసిటీ మెహండాలే వివరించారు.

ఇదీ చదవండి: బీరుట్​ పేలుడులో 135కి చేరిన మృతుల సంఖ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.