ETV Bharat / international

'ఆంక్షలతో ఒరిగేదేం లేదు.. సైనిక చర్య ఆగదు' - రష్యా బలగాలు

Sanctions on Russia: అమెరికా సహా దాని మిత్రపక్షాలు విధిస్తున్న ఆంక్షలతో పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది రష్యా. అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ లక్ష్యాలను సాధించే వరకు మిలిటరీ ఆపరేషన్​ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

Sanctions on Russia
రష్యా జెండా
author img

By

Published : Feb 26, 2022, 7:44 PM IST

Sanctions on Russia: అమెరికా సహా దాని మిత్రపక్షాలు రష్యాపై విధించిన 'అద్భుతమైన' ఆంక్షలతో ఎలాంటి మార్పు ఉండబోదని.. ఉక్రెయిన్​లోని డొన్​బాస్​ ప్రాంతాన్ని రక్షించే మిలిటరీ ఆపరేషన్​ కొనసాగుతుందని స్పష్టం చేసింది రష్యా. అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ లక్ష్యాలను చేరే వరకు ఈ సైనిక చర్య ఆగదని రష్యా భద్రతా మండలి డిప్యూటీ హెడ్​ దిమిత్రి మెద్వెదెవ్​ తెలిపారు.

ఉక్రెయిన్​ రాజధాని కీవ్​ సహా ఇతర ప్రాంతాలపై రష్యన్​ బలగాలు దాడులను ముమ్మరం చేసిన సమయంలో ఈ ప్రకటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

"ఈ అద్భుతమైన ఆంక్షలు పరిస్థితులను మార్చలేవు. అమెరికా విదేశాంగ శాఖలోని వారికి కూడా ఇది స్పష్టంగా తెలుసు. డొన్​బాస్​ను రక్షించే మిలిటరీ ఆపరేషన్​ కొనసాగుతుందని ఇది సూచిస్తోంది. "

- దిమిత్రి మెద్వెదెవ్​, రష్యా భద్రతా మండలి డిప్యూటీ హెడ్​

జార్జియాపై దాడిని గుర్తు చేస్తూ.. 2008లో జరిగిన తీరుగానే పరిస్థితులు కొనసాగుతాయనే నమ్మకం ఉందన్నారు మాజీ ప్రధాని. ఆంక్షలు అనేవి పురాణాలుగా అభివర్ణించారు దిమిత్రి. అవి మాటలకే పరిమితమని ప్రతి ఒక్కరికి తెలుసునన్నారు.

ఇదీ చూడండి: ప్రధాని మోదీతో మాట్లాడిన ఉక్రెయిన్​ అధ్యక్షుడు.. ఏమన్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.