ETV Bharat / international

బ్రిటన్​లో కఠిన ఆంక్షలు-నిరసిస్తూ స్థానికుల ర్యాలీ - కరోనా వార్తలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3 కోట్ల 28 లక్షల 45 వేలు దాటింది. మరో 9 లక్షల 94 వేల 866 మంది ప్రాణాలు కోల్పోయారు. 2 కోట్ల 42 లక్షలమందికిపైగా కోలుకున్నారు. బ్రిటన్​లో విధించిన పలు ఆంక్షలను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. నిరసనగా లండన్​ వీధుల్లో వేలాదిగా ర్యాలీ చేపట్టారు.

Russia's COVID-19 cases rise to 1,143,571
బ్రిటన్​లో కఠిన ఆంక్షలు-నిరసిస్తూ స్థానికుల ర్యాలీ
author img

By

Published : Sep 26, 2020, 10:42 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఆసియా దేశాల్లో కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.

రష్యాలో ఇవాళ 7,523 కొత్త కేసులు వెలుగుచూశాయి. మొత్తం కేసుల సంఖ్య 11 లక్షల 43 వేల 571కి చేరాయి. రాజధాని మాస్కోలోనే 1,792 మందికి వైరస్​ సోకింది. ఒక్కరోజే 169 మంది చనిపోయారు.

  • నేపాల్​లో మొత్తం కేసులు 71 వేల 821కి చేరాయి. ఇవాళ 1207 కొత్త కేసుల్ని గుర్తించారు. మరో 8 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 467కి చేరింది. లాక్​డౌన్​ ఆంక్షల్ని క్రమంగా సడలిస్తున్న నేపథ్యంలో కేసులు పెరుగుతున్నట్లు భావిస్తున్నారు.
  • సింగపూర్​లో మరో 20 మంది వైరస్​ బారినపడ్డారు. మొత్తం కేసులు 57 వేల 685కు చేరాయి. ఇందులో 5 విదేశాల నుంచి వారేనని ఆరోగ్య శాఖ తెలిపింది.
  • ఫిలిప్పీన్స్​లో మొత్తం కొవిడ్​ కేసులు 3 లక్షల మార్కు దాటాయి. శనివారం నమోదైన 2,747 కేసులతో కలిపి దేశంలో మొత్తం 3,01,256 మందికి కరోనా సోకింది. టెస్టుల సంఖ్య పెంచుతున్న నేపథ్యంలోనే కేసులు పెరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.

ఆంక్షలు కఠినం..

బ్రిటన్​లో కరోనా రెండో దశ నేపథ్యంలో.. ఆంక్షల్ని కఠినతరం చేస్తున్నారు. ఇంగ్లాండ్​లో కరోనా హాట్​స్పాట్ల సంఖ్యను 58 నుంచి 92కు పెంచారు. దేశంలో కరోనా కట్టడి కోసం మరింత కఠిన ఆంక్షలు విధించాలని ప్రధాని బోరిస్​ జాన్సన్​ను కోరారు లండన్​ మేయర్​ సాదిఖ్​ ఖాన్​. ప్రజలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

మరోవైపు దేశంలో లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘిస్తూ.. వేలాది మంది లండన్​ వీధుల్లో యాంటీ-లాక్​డౌన్​ ర్యాలీ చేపట్టారు. ఐదుగురి కంటే ఎక్కువ గుమికూడొద్దు అన్న ఆంక్షలపై గుర్రుగా ఉన్న స్థానికులు.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.

  • బ్రిటన్​లో 6 వేల 42 కొత్త కేసులు.. 34 మరణాలు నమోదయ్యాయి.
  • ఐరోపా దేశం స్లొవేకియాలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో కేసులు పెరిగాయి. తొలిసారి ఆ దేశంలో 500కుపైగా కొత్త కేసులు బయటపడ్డాయి. 552 మందికి వైరస్​ సోకగా.. మొత్తం కేసులు 8,600కు చేరాయి. ఇప్పటివరకు ఆ దేశంలో 44 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో దేశంలో ఆంక్షలు విధించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు ప్రధాన మంత్రి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.