ETV Bharat / international

అదే జరిగితే రష్యాపై దివాలా ముద్ర.. తీవ్ర పరిణామాలు? - వ్లాదిమిర్​ పుతిన్​

Russia Ukraine war impact: ఉక్రెయిన్​పై భీకర దాడులకు పాల్పడుతున్న రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. యుద్ధం, ఆంక్షల కారణంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం అంచులకు చేరుకుంది. ఈ సందర్భంలో విదేశాలకు చెల్లించాల్సిన అప్పులు కట్టలేక రష్యా చేతులెత్తేస్తే దానిపై దివాలా ముద్ర తప్పదంటున్నారు నిపుణులు. అదే జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

vladimir putin
వ్లాదిమిర్​ పుతిన్​
author img

By

Published : Mar 18, 2022, 9:35 PM IST

Russia Ukraine war impact: ఉక్రెయిన్‌లో ఎడతెరిపి లేకుండా బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా.. త్వరలో అందుకు భారీ మూల్యమే చెల్లించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం అంచులకు చేరుకున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాశ్చాత్య దేశాల ఆంక్షలతో సరకుల ధరలు పెరిగి అక్కడ సామాన్య ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు విదేశాలకు చెల్లించాల్సిన అప్పుల విషయంలోనూ రష్యా చేతులెత్తేసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే.. ఆ దేశంపై 'దివాలా' ముద్ర తప్పదు.

దివాలా అంటే..

సామాన్య ప్రజల తరహాలోనే ప్రభుత్వాలు సైతం భారీ ప్రాజెక్టులకు అప్పులు తీసుకుంటాయి. తిరిగి వాటిని నిర్ణీతకాలంలో చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ అప్పు తీసుకున్న వారు గడువులోగా చెల్లించకపోతే.. వారిపై 'దివాలా' లేదా 'ఎగవేతదారు' ముద్ర పడుతుంది. బాండ్లు జారీ చేయడం ద్వారా ప్రభుత్వాలు నిధులను సమీకరిస్తాయి. స్వదేశంతో పాటు విదేశీ పెట్టుబడిదారులు ఆ బాండ్లను కొనుగోలు చేసి నిధులు సమకూరుస్తారు. దానికి ప్రతిఫలంగా నిర్ణీత వడ్డీరేటుతో హామీతో కూడిన రాబడిని పొందుతారు. ఒకవేళ అలా చెల్లించడంలో విఫలమైతే దాన్ని ఎగవేత లేదా దివాలాగా ప్రకటిస్తారు. ఇలా ఒక దేశం ఆర్థికంగా దివాలా తీస్తే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకే ప్రభుత్వాలు దీని నుంచి తప్పించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తాయి. 1917 బోల్షెవిక్‌ విప్లవం తర్వాత రష్యా ఇప్పటి వరకు ఎప్పుడూ ఇతర దేశాల అప్పులను ఎగవేసిన దాఖలాలు లేవు.

ఇప్పుడు ఎందుకు చెల్లించలేదు?

నిజానికి రష్యా దగ్గర సరిపడా నగదు నిల్వలు ఉన్నాయి. కానీ వాటిని వాడుకునే పరిస్థితులు మాత్రం లేవు. 2014లో క్రిమియా ఆక్రమణ తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో అప్రమత్తమైన పుతిన్‌ పాలకవర్గం దాదాపు 640 బిలియన్ డాలర్ల విదేశీ నిధుల్ని సమకూర్చుకుంది. ప్రస్తుతం వీటిలో సగం నిధులు పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల స్తంభించిపోయాయి.

దీంతో ఆయా దేశాల ముఖ్యంగా పాశ్చాత్య దేశాల రుణదాతలకు తమ కరెన్సీ అయిన రూబుల్‌లో అప్పులు చెల్లిస్తామని రష్యా ఆర్థికమంత్రి ఆంటోన్‌ సిలునోవ్‌ గతవారం ప్రకటించారు. కానీ, ఇతర దేశాల్లో ప్రభుత్వయేతర రుణదాతలు ఆ చెల్లింపుల్ని స్వీకరించే అవకాశం లేదు. దీంతో అవన్నీ ఎగవేతగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ రేటింగ్‌ సంస్థలైన- ఫిచ్‌, ఎస్‌అండ్‌పీ, మూడీస్‌- రష్యా ఆర్థిక పరిస్థితిని 'ఇన్వెస్ట్‌మెంట్‌' గ్రేడ్‌ నుంచి 'జంక్‌' (అంటే దేనికీ పనికిరాని) గ్రేడ్‌గా మార్చాయి.

ఇటీవలి చెల్లింపుల సంగతేంటి?

అమెరికాకు చెందిన రెండు డాలర్‌ బాండ్లకు 117 మిలియన్ డాలర్ల వడ్డీ చెల్లించాల్సిన గడువు బుధవారంతో తీరిపోయింది. రష్యా మరి చెల్లించిందా?లేదా? అనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. అమెరికా ఆర్థికశాఖ మాత్రం ఈ లావాదేవీ జరగడానికి తాము అనుమతించబోమని స్పష్టం చేసింది. మరోవైపు ఇప్పటికే చెల్లింపులు చేశామని రష్యా ఆర్థిక మంత్రి బుధవారం ప్రకటించారు. మరి వాటిని అమెరికా అధికారులు స్వీకరించారో.. లేదో.. తెలియలేదు. అమెరికాలోని పెట్టుబడిదారులు మాత్రం తమకు ఇప్పటి వరకు నిధులు అందలేదని తెలిపారు. అయితే, నిబంధనల ప్రకారం..చెల్లింపులకు మరో 30 రోజుల అదనపు గడువు ఉండడం గమనార్హం. ఈ నెల వ్యవధిలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది!

ఒకవేళ ఎగవేతదారుగా ప్రకటిస్తే..

ఒకవేళ రష్యాను దివాలా దేశంగా ప్రకటిస్తే అది దిక్కులేని స్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని బ్లూబే అసెట్‌ మేనేజ్‌మెంట్‌లో పనిచేస్తున్న ఆర్థికవేత్త టిమోతీ యాష్‌ చెప్పారు. ఇప్పటికే ఉక్రెయిన్‌పై దాడితో.. ఉన్న కొంతమంది మిత్రుల్నీ దూరం చేసుకున్న రష్యా.. విదేశీ రుణాలకు సైతం నోచుకునే అవకాశం ఉండదని తెలిపారు. ఇప్పటికే రష్యాయేతర కంపెనీలన్నీ అక్కడ కార్యకలాపాలను నిలిపివేశాయి. రూబుల్‌ విలువ 10 శాతానికి పైగా క్షీణించింది. ఫలితంగా 1.7 లక్షల కోట్ల రూబుళ్ల విలువైన ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోంది. ఇప్పటికే రష్యా కేంద్ర బ్యాంకు కీలక వడ్డీ రేట్లను 9.5 శాతం నుంచి 20 శాతానికి పెంచింది. దీని వల్ల జనజీవన ప్రమాణాలు మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది.

రష్యాకు ముఖ్యవనరు ముడి చమురే. యుద్ధానికి ముందు అంతర్జాతీయ ఆర్థిక రికవరీ కనిపించడం, ముడిచమురు ధరలు పెరగడంతో గత ఏడాదిలో రష్యా స్థూల దేశీయోత్పత్తి 4.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం అనంతరం అత్యంత వేగవంతమైన వృద్ధి ఇది. కానీ ఇప్పటి పరిణామాలు చూస్తుంటే.. సోవియట్‌ యూనియన్‌ ముక్కలయ్యాక 1990లలో ఏర్పడిన మాంద్యం కంటే ఈసారి ఎక్కువ ప్రభావమే ఉండొచ్చన్నది విశ్లేషకుల అంచనా.

మరోవైపు రష్యా దివాలా ప్రభావం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ఇప్పట్లో ఉండే అవకాశం లేదని ఐఎంఎఫ్‌ ఎండీ క్రిస్టలినా జార్జియేవా ఇటీవల తెలిపారు. అయితే, రష్యాకు పెద్ద ఎత్తున రుణాలిచ్చిన సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రమాకారిగా పరిణమించే అవకాశం ఉందని క్యాపిటల్‌ ఎకానమిక్స్‌లోని ఆర్థికవేత్తలు హెచ్చరించారు. అయితే, రానున్న రోజుల్లో పరిస్థితులు ఏ మలుపు తీసుకుంటాయనే దానిపై ఇవి ఆధారపడి ఉన్నాయి.

ఇదీ చూడండి: పుతిన్‌ యుద్ధ నేరస్థుడా? శిక్షించడం సాధ్యమేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.