Russia Ukraine War: రష్యాతో యుద్ధం జరుగుతున్న వేళ.. యూరోపియన్ పార్లమెంట్లో వర్చువల్గా మాట్లాడారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. ఐరోపాలో సభ్య దేశంగా ఉండటానికి ఉక్రెయిన్ పోరాడుతోందన్నారు.
"నేడు మా సత్తా ఏంటన్నది నిరూపించుకున్నట్లు నమ్ముతున్నాను. మేము మీ లాంటివారిమేనని.. మా స్వేచ్ఛ, మాతృభూమి కోసమే కాకుండా ఐరోపా సమాఖ్యలో సమాన సభ్యదేశంగా ఉండేందుకు ఉక్రెయిన్ పోరాడుతోంది" అని యూరోపియన్ పార్లమెంట్లో పేర్కొన్నారు జెలెన్స్కీ.
ఉక్రెయిన్ అధ్యక్షుడికి అరుదైన గౌరవం
యూరోపియన్ పార్లమెంట్లో జెలెన్స్కీకి అరుదైన గౌరవం లభించింది. ఈయూ పార్లమెంట్లో జెలెన్స్కీ.. ఉక్రెయిన్లో ప్రస్తుత పరిస్థితులపై మట్లాడిన తర్వాత సభ్యులంతా నిలిబడి చప్పట్లు కొట్టారు(స్టాండింగ్ ఒవేషన్).
"మా మాతృభూమి, స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాం. మేము ఉక్రెయినీయన్లం. శక్తుమంతులం. మమ్మల్ని ఎవరూ విడదీయలేరు" అని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత సభ్యులంతా లేచి ఆయన్ని చప్పట్లతో అభినందించారు.
ఇదీ చూడండి: 'కీవ్' లక్ష్యంగా రష్యా దూకుడు.. 65 కి.మీ. పొడవున మోహరింపులు