ETV Bharat / international

పిట్టల్లా రాలుతున్న రష్యా విమానాలు.. ఆ క్షిపణులే కారణం!

Russia Ukraine war: రష్యా దాడిని సమర్థంగా ప్రతిఘటిస్తున్నాయి ఉక్రెయిన్​ సేనలు. యుద్ధానికి తెలివిగా సిద్ధమైన ఉక్రెయిన్ జవాన్లు.. రష్యా విమానాలను పిట్టల్లా కూల్చేస్తున్నారు. తక్కువ ఎత్తులో వచ్చే విమానాలపై భుజాలపై నుంచి ప్రయోగించే క్షిపణులతో సరిగ్గా గురి చూసి.. దాడి చేస్తున్నారు. మరోవైపు రష్యా దళాల కదలికలను అమెరికా, జర్మనీ నిఘా వర్గాలు గుర్తించి శాటిలైట్‌ చిత్రాలు, ఎలక్ట్రానిక్‌ సమాచారం విశ్లేషించి గంట నుంచి రెండు గంటల్లోపే ఉక్రెయిన్‌కు అందిస్తున్నాయి. వీటి ఆధారంగా ఉక్రెయిన్‌ దళాలు వ్యూహరచన చేసుకొంటున్నాయి.

Russia Ukraine war
Russia Ukraine war
author img

By

Published : Mar 9, 2022, 2:10 PM IST

Russia Ukraine war: ప్రపంచంలోనే అత్యంత అణుశక్తి ఉన్న రష్యా.. ఉక్రెయిన్‌పై దాడిలో తీవ్రమైన ఎదురు దెబ్బలు తింటోంది. ఇంత జరుగుతున్నా.. రష్యా అత్యాధునిక యుద్ధవిమానాలు ఇంకా రంగంలోకి దిగలేదు. ఇక, కదన రంగంలోకి వచ్చిన విమానాలకు పాట్లు తప్పడంలేదు. అమెరికా మిత్రదేశాలు భారీగా విమాన విధ్వంసక, ట్యాంక్‌ విధ్వంసక ఆయుధాలను ఉక్రెయిన్‌కు సరఫరా చేశాయి.

మరోపక్క ఈ ఒక్క ఏడాది చివరి నాటికి రష్యా మరో 60 అత్యాధునిక యుద్ధవిమానాలను వైమానిక దళంలోకి చేర్చుకొంటుందని ఇటీవల దాని లెఫ్టినెంట్‌ జనరల్‌ సెర్గీ డ్రోనోవ్‌ గొప్పగా చెప్పుకొన్నారు. మాస్కో అమ్ములపొదిలో సుఖోయ్‌-30, 35, 57 వంటి భారీ ఫైటర్‌ జెట్లు.. సుఖోయ్‌-34 బాంబర్లు చేరనున్నట్లు పేర్కొన్నారు. కానీ, ఇవన్నీ సిరియా యుద్ధభూమిపై పరీక్షించినవే.. రాడార్ల కళ్లుగప్పగలవని ఘనంగా రష్యా జనరల్స్‌ చెబుతున్నారు. 2009-2020 వరకు రష్యా 440 కొత్త విమానాలను, వేల కొద్దీ డ్రోన్లను దళాల్లోకి చేర్చింది. ఈ స్థాయిలో వైమానిక శక్తి ఉంటే.. కేవలం రోజుల్లోనే ఉక్రెయిన్‌ ఆక్రమించాలి.. కానీ, తొలి రోజుల్లో రష్యా వైమానిక దళం పాత్ర చాలా తక్కువగా ఉంది. ఇటీవల కొంచెం పెంచి ఉండొచ్చు.. అయినా, వేగవంతమైన ఫైటర్‌ జెట్ల సార్టీల సంఖ్యల పరిమితంగా ఉండటమే గాక, తక్కువ ఎత్తులో నిర్వహించాయి. అవి కూడా రాత్రివేళలకే పరిమితం అయ్యాయని లండన్‌లోని ది రాయల్‌ యూనివర్శిటీకి చెందిన జెస్టిన్‌ బ్రాంక్‌ వెల్లడించారు.

Russia Ukraine news

యుద్ధం ప్రారంభించే సమయంలో రష్యా భారీ ఎత్తున క్రూజ్‌, బాలిస్టిక్‌ క్షిపణుల వర్షం కురిపించింది. దీంతోపాటు భారీ శతఘ్నులను వాడింది. ఉక్రెయిన్‌ విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. 2014 తర్వాత నుంచి నాటో సహాయ సహకారాలు పొందుతున్న ఉక్రెయిన్‌.. రష్యా తొలి లక్ష్యాలు ఏమిటనేది ముందే పసిగట్టి జాగ్రత్తలు తీసుకొంది. దాని ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను సురక్షిత స్థానాలకు తరలించింది. ఉక్రెయిన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు ప్రభావవంతగా పనిచేస్తున్నాయని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఓపెన్‌ సోర్స్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థలు కూడా వీటిని ధ్రువీకరించాయి. రష్యాకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోని ఖర్కివ్‌పై వైమానిక, శతఘ్నులు, క్షిపణులతో దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో కొన్నింటిని ఉక్రెయిన్‌ గగనతల వ్యవస్థ కూల్చివేస్తున్న దృశ్యాలు సీసీకెమెరాల్లో నమోదయ్యాయి. రెండు విమానాలు కూలిన దృశ్యాలు కూడా ఉన్నాయి. బక్‌ క్షిపణులను వాడి ఉక్రెయిన్‌ వీటిని కూల్చింది.

రష్యా విమానాలు తక్కువ ఎత్తులో ఎందుకు..

Russia attack on Ukraine: బక్‌ క్షిపణి వ్యవస్థను మొబైల్‌ లాంఛర్‌పై ఉంచి వినియోగిస్తారు. దీని రాడార్‌ లక్ష్యాలను గుర్తించగానే.. క్షిపణిని ప్రయోగించి.. ఆ ప్రదేశం నుంచి సురక్షిత స్థానానికి వెళ్లిపోతారు. బక్‌ వ్యవస్థ తక్కువ ఎత్తులో వచ్చే లక్ష్యాలను వెంటనే గుర్తించలేదు. రష్యా పైలెట్లు ఈ లోటును ఆయుధంగా చేసుకుని, దాడి చేసేందుకు భూమికి తక్కువ ఎత్తులో వస్తున్నారు. అయితే, బక్‌ సమస్యను తప్పించుకొనేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం వారికి ప్రాణాంతకంగా మారుతోంది. ఉక్రెయిన్‌ దళాలు భుజాలపై నుంచి ప్రయోగించే క్షిపణులతో ఆ విమానాలను కూల్చేస్తున్నారు.

  • ఉపగ్రహాలు, ఇతర కమ్యూనికేషన్‌ వ్యవస్థలకు సంబంధం లేకుండా మొద్దుగా ప్రయోగించే 'డంబ్‌' బాంబులను రష్యా ఉపయోగిస్తోంది. వీటిని గురిగా లక్ష్యంపై జారవిడవాలంటే భూమికి తక్కువ ఎత్తులో ఎగరాల్సిందే. ఇది కూడా వారిని స్టింగర్లకు ఎరగా మార్చేస్తోంది. చెర్నిహివ్‌ ప్రాంతంలో ఇటీవల కూల్చిన సు-34 విమానానికి 'డంబ్‌' బాంబులు ఉన్నట్లు గుర్తించారు.

17,000 యాంటీ ఎయిర్‌క్రాఫ్‌, ట్యాంక్‌ ఆయుధాలతో స్వాగతం..

ఇటీవల వారాల్లో భుజాలపై నుంచి ప్రయోగించే విమాన విధ్వంసక, ట్యాంక్‌ విధ్వంసక క్షిపణులను అమెరికా, నాటో దేశాలు భారీగా ఉక్రెయిన్‌కు తరలించాయి. గడిచిన ఒక్క వారమే అమెరికా మిత్ర దేశాలు 17,000 యాంటీ ట్యాంక్‌ ఆయుధాలను ఉక్రెయిన్‌కు తరలించినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం వెల్లడించింది. వీటిల్లో స్టింగర్లు, జావెలిన్లు, లా, ఎన్‌లా వంటి ఆయుధాలను పంపించాయి. వీటిని నింపుకొన్న సైనిక విమానాలు పోలాండ్‌, రొమేనియాల మీదుగా వివిధ వైమానిక స్థావరాల్లో వీటిని అన్‌లోడ్‌ చేస్తూ యుద్ధభూమికి తరలిస్తున్నాయి.

రక్షణ రంగ బ్లాగ్‌ ఓరెక్స్‌ సామాజిక మాధ్యమాల్లో లభించిన చిత్రాలను విశ్లేషించి రష్యా 11 ఫైటర్‌ జెట్లు, 11 హెలికాప్టర్లు, రెండు డ్రోన్లను కోల్పోయినట్లు ధ్రువీకరించింది. మరోపక్క ఉక్రెయిన్‌ మాత్రం 39 విమానాలు, 40 హెలికాఫ్టర్లను రష్యా కోల్పోయినట్లు ప్రకటించింది.

1980ల్లో సోవియట్‌ సేనలు అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించిన తర్వాత అమెరికా నిఘా సంస్థ సీఐఏ స్టింగర్‌ వంటి యాంటీ ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్షిపణులను ముజాహిద్దీన్లకు పంపింది. వీటితో వారు సోవియట్‌కు చెందిన 300 హెలికాప్టర్లు, 100 ఫైటర్‌ జెట్లను నేలకూల్చారు.

జెలెన్‌స్కీ ఎన్‌క్రిప్టెడ్‌ సమాచార వ్యవస్థ..

రష్యా దళాల కదలికలను అమెరికా, జర్మనీ నిఘా వర్గాలు గుర్తించి శాటిలైట్‌ చిత్రాలు, ఎలక్ట్రానిక్‌ సమాచారం విశ్లేషించి గంట నుంచి రెండు గంటల్లోపే ఉక్రెయిన్‌కు అందిస్తున్నాయి. వీటి ఆధారంగా ఉక్రెయిన్‌ దళాలు వ్యూహరచన చేసుకొంటున్నాయి. మరోపక్క ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై ఉన్న రష్యా నిఘాను తప్పించేందుకు అమెరికా ప్రత్యేకమైన ఎన్‌క్రిప్టెడ్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థను సమకూర్చింది. ఈ వ్యవస్థను వినియోగించే జెలెన్‌స్కీ శనివారం రాత్రి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో 35 నిమిషాలపాటు మాట్లాడారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.