ETV Bharat / international

ఉక్రెయిన్​పై యుద్ధం ప్రకటించిన పుతిన్.. కీవ్​లో పేలుడు

author img

By

Published : Feb 24, 2022, 8:45 AM IST

Updated : Feb 24, 2022, 9:47 AM IST

russia ukraine war
russia ukraine war

08:42 February 24

ఉక్రెయిన్​పై యుద్ధం ప్రకటించిన పుతిన్..

Putin declares war on Ukraine: అనుకున్నదే జరిగింది.. ఉక్రెయిన్​పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఉక్రెయిన్​లో సైనిక ఆపరేషన్ చేపట్టనున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. పౌరులను కాపాడేందుకే ఈ చర్యలు చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రజలను ఉద్దేశించి టెలివిజన్​ ద్వారా ప్రసంగించిన పుతిన్.. ఉక్రెయిన్ నుంచి ఎదురవుతున్న ముప్పుకు స్పందనగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఉక్రెయిన్​ను ఆక్రమించుకోవాలని తమకు ఎలాంటి లక్ష్యం లేదని పుతిన్ పేర్కొన్నారు. రక్తపాతానికి ఉక్రెయిన్ పాలకులదే బాధ్యత అని చెప్పారు.

ఈ సందర్భంగా అంతర్జాతీయ సమాజానికి హెచ్చరికలు చేశారు పుతిన్. రష్యా చేపట్టిన చర్యల్లో తలదూర్చేందుకు ప్రయత్నిస్తే.. 'ఇదివరకు ఎన్నడూ చూడని పరిణామాలు చూడాల్సి ఉంటుంది' అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.

"ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించుకోవడం మా ప్రణాళిక(సైనిక చర్య)లో భాగం కాదు. ఉక్రెయిన్​లో సైనికీకరణకు వ్యతిరేకంగా పనిచేస్తాం. ఈ విషయంలో కలగజేసుకోవాలని ప్రయత్నించినా.. మా దేశం, మా ప్రజలకు ముప్పు కలిగేలా ప్రయత్నించినా.. రష్యా వెనువెంటనే తగిన చర్యలు తీసుకుంటుంది. చరిత్రలో ఎన్నడూ జరగని పరిణామాలకు ఇది దారితీస్తుంది."

-వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు

పుతిన్ ప్రకటన చేసిన నిమిషాల వ్యవధిలోనే ఉక్రెయిన్ రాజధాని కీవ్​లో పేలుడు సంభవించింది. రష్యా సైనిక దళాలే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

స్పందించిన బైడెన్

పుతిన్ ప్రకటనపై అమెరికా నిమిషాల్లోనే స్పందించింది. రష్యా చేసే ఈ దాడుల వల్ల జరిగే విధ్వంసం, ప్రాణనష్టానికి ఆ దేశానిదే పూర్తి బాధ్యత అని పేర్కొంది. అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి ఐకమత్యంతో దీనికి నిర్ణయాత్మకంగా స్పందిస్తుందని అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. రష్యాను ప్రపంచం బాధ్యుల్ని చేస్తుందని స్పష్టం చేశారు.

Last Updated : Feb 24, 2022, 9:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.